Tuesday, November 28, 2023

బర్త్‌డే రోజున ఆ క్రేజీ మూవీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

mahesh babu trivikram new movie latest update

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా హిట్ కాలేకపోయాయి. కానీ ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ లిస్టులో స్థానం పొందాయి. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్.. అరవిందసమేత, అలవైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్‌లో ఉండగా.. అటు మహేష్ బాబు వరుసగా విజయాలతో మరో బ్లాక్‌బస్టర్ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉండేసరికి ఈ కాంబినేషన్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం వీరి సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్‌లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవలే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు ఈ సినిమా ప్రారంభం కానుందని అనుకున్నారు. కానీ ఆరోజు నిరాశే మిగిలింది. తాజా సమాచారం ప్రకారం.. వీరి సినిమా మహేష్ పుట్టినరోజైన ఆగస్టు 9న లాంఛనంగా ప్రారంభం కానుందని టాక్. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News