Sunday, April 28, 2024

మాలే డ్రాగన్ పెనవేతల బంధం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : మాల్దీవుల దేశాధ్యక్షులు మెహమ్మద్ ముయిజు సోమవారం చైనా పర్యటనకు వచ్చారు. చైనాలో ఆయన ఐదురోజుల పర్యటన ముందుగానే ఖరారు అయింది. లక్షద్వీప్‌ల్లో భారత ప్రధాని పర్యటన, పర్యాటక స్థలిగా ప్రచారం తరువాత మాల్దీవుల మంత్రులు భారత్‌ను, మోడీని తిట్టిపోయడం, దౌత్యసంబంధాలు బెడిసికొడుతున్న దశలోనే ముయిజ్ చైనా పర్యటన సాగుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మాల్దీవుల నేత తరచూ చైనా అనుకూల వైఖరికి దిగుతూ వచ్చారు. భార్య సజీదా మెహమ్మద్, తోడుగా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి మాల్దీవుల నేత సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. పలు విషయాలపై చైనా అధినేత జి జిన్‌పింగ్ ఇతరులతో మాలే అధ్యక్షులు చర్చలు జరుపుతారు. నిర్ణీత వ్యూహం ప్రకారమే ఇరువురు నడుమ ఉభయదేశాల దౌత్యసంబంధాల వృద్ధి దిశలో పలు సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. చైనాకు చేరుకున్న మాల్దీవుల నేతకు విమానాశ్రయంలో చైనా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

మెహమ్మద్ దంపతులను చైనా పర్యటనకు సాదరంగా ఆహ్వానించారు. చైనాలో ముయిజు అధికారిక తొలి పర్యటన ఇదే. ఇక్కడికి రాగానే ముయిజ్ తమ బృందంతో కలిసి ముందుగా జియామెన్ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం సందర్శించారు. ఇది ఫూజియన్ ప్రాంతంలో ఉంది. చైనా నేతతో మాల్దీవుల నేత పలు విషయాలపై చర్చలు జరుపుతారని , పలు కీలక అంశాలలో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదురుతాయని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంబిన్ తెలిపారు. మాల్దీవుల కొత్త నేత చైనా అనుకూలతతో ఇటీవలి కాలంలో భారతదేశం కొన్ని సందర్భాలలో పరోక్షంగా విమర్శలకు దిగింది. హిందూ మహాసముద్ర జలాల భద్రత వంటి అత్యంత కీలక విషయాలలో ఈ పర్యటనలో చైనా మాల్దీవుల మధ్య ఒప్పందం కుదిరితే అది భారత్ మాల్దీవుల మధ్య దౌత్య బంధానికి మరింత విఘాతానికి దారితీస్తుందని విశ్లేషణలు వెలువడ్డాయి.

అయితే ప్రెసిడెంట్ చైనా పర్యటన దశలో శాస్త్ర సాంకేతిక, సామాజిక ఆర్థిక సంబంధిత విషయాలలో , వ్యాపార వాణిజ్య రంగాలలో ఇరు దేశాల మధ్య ముఖ్యమైన ఒప్పందాలు కుదురుతాయని మాల్దీవుల ప్రతినిధి ఒక్కరు తెలిపారు. చైనాలోని ఫుజో నగరంలో జరిగే ఇన్వెస్ట్ మాల్దీవ్స్ ఫోరంలో కూడా మాల్దీవుల నేత పాల్గొంటారు. చైనా వ్యాపారవేత్తలను , పారిశ్రామికవేత్తలను తమ దేశానికి మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానిస్తారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News