Wednesday, May 1, 2024

కాంగ్రెస్ కే గ్యారెంటీ లేదు… ఆరు గ్యారెంటీలా?: మాలోత్ కవిత

- Advertisement -
- Advertisement -

ములుగు: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో ములుగులో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని బిఆర్ఎస్ ఎంపి మాలోత్ కవిత తెలిపారు. గ్రామపంచాయతీగా ఉన్న ములుగును జిల్లా చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని, సరియైన ఆసుపత్రి కూడా లేని ములుగుకు మెడికల్ కళాశాల వరంగా ఇచ్చిన చరిత్ర కెసిఆర్ కే దక్కుతుందని ప్రశంసించారు.

కొత్త రెవెన్యూ డివిజన్, కొత్తమండలాలు, వందలకోట్ల అభివృద్ధి నిధులు ఇచ్చి ములుగులో అభివృద్ధి వెలుగులు తెచ్చిన గొప్పమనసు కెసిఆర్ ది అని కొనియాడారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమాలకు రాజకీయాలను ముడిపెట్ట కూడదనే మహోన్నత లక్ష్యంతో, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న పట్టించుకోకుండా ములుగు అభివృద్ధికి బాటలు వేసిన మహానాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని మాలోత్ కవిత పొగిడారు.  వచ్చి..వెళ్లడం కాదని అధికారంలోకి వచ్చాక ములుగు నియోజకవర్గంలో ఊరువాడ ఎలా అభివృద్ధి చెందాయో.. ప్రజలకు, ప్రతి ఇంటికి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో కాస్త తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీరు ఒక్కరోజు కూడా ములుగు గిరిజన యూనివర్సిటీ గురించి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని అడిగారు. మేడారం జాతరకు జాతీయహోదా ఇవ్వాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారో సమాదానం చెప్పాలని కవిత నిలదీశారు.కాంగ్రెస్ పార్టీ కే గ్యారెంటీ లేదని, ఆరుగ్యారెంటీలు ఎవరూ పట్టించుకోవడంలేదని చురకలంటించారు. రాహుల్..జీ.!! మళ్ళీ చెబుతున్నా..!! ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లడం కాదని, ములుగు ప్రాంతంపై ప్రత్యేక అభిమానంతో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రగతిని సోదరి ప్రియాంకగాంధీతోపాటు కలిసి చూసి వెళ్లాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News