Saturday, April 27, 2024

భూ (దొడ్ల స్థలం) వివాదంలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Man brutally murdered in Pudur village in land disputes

పరస్పర దాడులు… మరో వ్యక్తికి తీవ్రగాయాలు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన గద్వాల డీఎస్పీ, గద్వాల సీఐ

మన తెలంగాణ/గద్వాల రూరల్: దొడ్ల స్థల (పశువులకు మేత నిల్వ చేసే స్థలం) నిర్మాణంలో హద్దులు ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని పూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. హత్య చేసిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులపై హత్యకు గురైన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు హత్యయత్నాకి పాల్పడగా .. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో రక్తపాతాలు జరగడంతో గ్రామమంతా ఉలిక్కిపడింది. పోలీసుల పహరాలో గ్రామంలోని ప్రజలు గడుపుతన్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల మండలం పూడూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 1427లో బీసన్నకు చెందిన 7.16 ఎకరాల భూమిని గతంలో గ్రామానికి చెందిన కొంత మంది రైతులకు విక్రయించాడు. కొనుగోలు చేసిన భూమిలో రైతులు దొడ్లను (పశువులకు మేత నిల్వ చేసే స్థలం) నిర్మించుకున్నారు.

గతంలో బీసన్న సాదాబైనామ కాగితాలపై ఇతరులకు విక్రయించగా రెవెన్యూ రికార్డులో మార్పులు చేసుకోకపోవడంతో.. అదే అదునుగా బావించిన బీసన్న కుటుంబసభ్యులు తమ తాత పేరు మీద ఉన్న పట్టాభూమిని తమ పేర్లపై నూతన రెవెన్యూ చట్టం ద్వారా నమోదు చేసుకున్నారు. గతంలో భూమిని కొనుగోలు చేసిన రైతులు ఈ భూమి మాదేనని ప్రశ్నించడంతో బీసన్న వారసులు కోర్టును ఆశ్రయించారు. బీసన్న వారసులకే కోర్టు స్టే ఇవ్వడంతో రైతులు ఎవరూ అట్టి స్థలంలోకి వెళ్లరాదని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకపోవడంతో రైతులు కోర్టుకు వెళ్లి స్టేను వేకెన్సీ చేయించారు. కోర్టు స్టే ప్రకారం ఎవరీ స్థలంలో వారు దొడ్లు నిర్మించుకోవాలని తీర్పు ఇవ్వడంతో.. శుక్రవారం ఉదయం వీరభద్రుడితో (55) పాటు మరి కొంత మంది రైతులు తమ స్థలంలో దొడ్ల నిర్మాణం కోసం హద్దులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో భీసన్న మనువడు రాఘవేంద్ర.. వీరభద్రుడిపై గొడ్డలితో దాడి చేయగా వీరభద్రుడు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

హత్యకు గురైన వీరభద్రుడి కుటుంబసభ్యులు హత్య చేసిన రాఘవేంద్ర కోసం వెతుకుతుండే క్రమంలో అటుగా వెళ్లుతున్న రాఘవేంద్ర చినాన్న అయిన వెంకటస్వామిపై దాడి చేయగా ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గద్వాల రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిని వెంకటస్వామిని చికిత్స నిమిత్తం తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం గద్వాల డీఎస్పీ ఎ.యాదగిరి, సీఐ షేక్ మహబూబ్ బాష సంఘటన స్థలాని పరిశీలించి గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. వీరభద్రుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు గద్వాల డీఎస్పీ ఎ.యాదగిరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News