Sunday, April 28, 2024

ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.90,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఎపికి చెందిన ఐతం రవిశేఖర్ ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని చెప్పి పలువురిని మోసం చేశాడు. మహిళలు, యువతులకు ఉద్యోగం, రుణాలు, ఇంటిని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకోవడం, అత్యాచారం చేస్తున్నాడు.

ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో మోసం చేయడంతో 38 కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్టు చేయగా తప్పించుకుని పరారయ్యాడు. తర్వాత 2019, జూలై 25వ తేదీన హయత్‌నగర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థినికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. కేసు దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. నిందితుడికి శిక్ష పడే విధంగా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ అభినందించారు.

Man gets life sentence for Kidnap and Rape in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News