Saturday, April 27, 2024

ఆ మార్గాల్లో వచ్చిన వారిని కనిపెట్టడం కష్టం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్యా అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన సందర్భంగా కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తెలంగాణలో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని, తొమ్మిది మంది ఇతర మార్గాల్లో రాష్ట్రంలోకి వచ్చారని, వేరే ఎయిర్‌పోర్టుల్లో దిగి రోడ్డు మార్గాల్లో తెలంగాణకు రావడాన్ని కనిపెట్టడం కష్టమన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కూడా రోడ్డు, రైలు మార్గం ద్వారా వచ్చిన వారే ఉన్నారన్నారు. వియత్నం చైనా పక్కనే ఉంది అయినా ఆ దేశానికి ఇబ్బంది లేదన్నారు. ఏ దేశంలో ముందస్తు చర్యలు తీసుకోలేదో అక్కడ ఎఫెక్ట్ ఉందని, చైనా, ఇటలీ నిర్లక్ష్యం చేశాయి కాబట్టే ఇబ్బంది పడ్డారన్నారు. మార్చి-1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చామని, మార్చి-1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరికి వారు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

బహిరంగ సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు ప్రజలను అనుమతించవద్దని, ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్య సూత్రమన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ సిబ్బంది విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను రద్దు చేశామన్నారు. తెలంగాణ సరిహద్దులో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని కెసిఆర్ తెలిపారు. పదో తరగతి పరీక్షలు కేంద్రాలు కొనసాగుతాయని, టెన్త్ పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. పంచాంగ శ్రవణాన్ని ప్రజల కోసం లైవ్ కాస్ట్ చేస్తామని, ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంటామని చెప్పినా వాళ్లపైనా పర్యవేక్షణ ఉంటుందన్నారు.

 

Corona virus spread in Karimnagar says CM KCR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News