Thursday, May 9, 2024

కొవిడ్ వ్యాక్సిన్లతో వేరియంట్ల నుంచి రక్షణ

- Advertisement -
- Advertisement -

యేల్ వర్శిటీ తాజా పరిశోధన వెల్లడి

Corona Vaccine Protection from variants

 

వాషింగ్టన్ : కొవిడ్ టీకా తీసుకున్నవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడయింది. వ్యాక్సిన్ తీసుకోడానికి ముందే కొవిడ్‌కు గురైన వారిలోనైతే కరోనాకు వ్యతిరేకంగా అత్యంత బలమైన రోగ నిరోధక శక్తి ఉంటున్నట్టు తేలింది. యేల్ విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధన వివరాలను నేచర్ పత్రిక అందించింది టీకాలు తీసుకున్న తరువాత కరోనా సోకితే వాటిని బ్రేక్‌త్రూ కేసులుగా పరిగణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయా ? లేదా అన్న సందేహం ఏర్పడింది. ఈ అంశంపై దృష్టి సారించిన పరిశోధకులు గత ఏడాది డిసెంబరులో అమెరికాకు చెందిన 40 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్తనమూనాలను సేకరించారు. తర్వాత వారికి మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా అందించారు. మొదటి, రెండో డోసు టీకా ఇచ్చిన తరువాత కూడా వారి నుంచి రక్తనమూనాలను సేకరించారు. అనంతరం వాటిని డెల్టా సహా 16 రకాల వేరియంట్లపై ప్రయోగించి యాంటీబాడీల స్థాయిని, టీ కణాల ప్రతిస్పందనను గమనించారు. వైరస్ వేరియంట్, వ్యక్తిని బట్టి రోగనిరోధక స్పందనలు, యాంటీబాడీల స్థాయి ఆధారపడి ఉంటున్నాయి. అందులోనూ అవి ఒకేలా ఉండడం లేదు. చాలా రకాల వేరియంట్లను సమర్ధంగా ఎదుర్కోడానికి దోహదపడుతున్నాయని పరిశోధకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News