Monday, May 6, 2024

భార్య, కూతురి ఆచూకి కోసం సిఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భార్య ,కూతురు ఆచూకి తెలిపాలంటూ సిఎం క్యాంపు కార్యాలయం ముందు ఓ వ్యక్తి ధర్నా చేస్తున్న ఘటన ఆంద్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన ఆవలకొండ కిషోర్ చంద్రారెడ్డి తన భార్య, 10 సవంత్సరాల అమ్మాయితో జంగారెడ్డి గూడెంలో నివాసముంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు.కాగా వారి ఇంటికి సమీపంలో కిరాణ షాపు యజమాని సంవత్సరం కిందట వారి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లో అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

అ తర్వాత కిరాణ షాపు యజమని నుంచి బెదిరింపులు రావడంతో జంగారెడ్డిగూడెం నుంచి పాకాల సమీపంలో ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 3న సాయంత్రం అనారోగ్య రీత్యా ఆసుపత్రికి వెళ్లిన భార్య ,కూతురు పాకాలలో రైలెక్కారని, రాత్రి 11 గంటలకు చివరి సారిగా ఫోన్ లో మట్లాడినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ అవ్వడంతో మరుసటి రోజు అనగా ఏఫ్రిల్ 4 న పాకాల నుంచి గుంటూరు కు వెళ్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారని ఆయన తెలిపారు. సివిల్ పోలీసుల వద్దకు వెళితే..రైల్వే పోలీసులకే చూసుకుంటారని అన్నారు.

దీంతో వారం రోజులుగా అధికారుల చుట్టు తిరుగుతున్న కేసు నమోదు చేయడం లేదని, తన భార్య కూతురు ఏమయ్యారో తెలియడం లేదని అన్నారు. గతంలో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి పై అనుమానం ఉన్నట్లు మీడియా సమక్షంలో ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన భార్య, కూతురు ఆచూకి తెలపాలంటూ విన్నపమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News