Friday, May 3, 2024

ఒక కరోనాకు పెక్కు టీకాలు

- Advertisement -
- Advertisement -

Many vaccines for Coronavirus

 

ప్రపంచ వ్యాప్తంగా నేటికి కరోనా బారిన పడిన ప్రజలు 7.1 కోట్లు, మరణించిన వారు 1.6 మిలియన్లు దాటుతున్న కల్లోల అకాలంలో విశ్వమానవాళి భయం గుప్పిట్లో సతమతమవుతున్నది. ఇండియాలో కరోనా కేసులు కోటి దాటేందుకు పరుగు తీస్తూ మరణాలు 1.42 లక్షలు దాటింది. కోవిడ్- 19 విధించిన సామాజిక క్రమశిక్షణకు అలవాటుపడిన ప్రజానీకానికి భవిష్యత్తు అగమ్యగోచరంగా తోస్తున్నది. కరోనా కట్టడికి విశ్వవ్యాప్తంగా 58 కంపెనీలు కరోనా టీకాను వేగంగా రూపొందించే క్లినికల్ ట్రయల్స్ ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ ద్వారా సంతృప్తికర ఫలితాలు, బిలియన్ వ్యాక్సీన్ డోసులు తయారు చేయగల సామర్థ్యం, 100 శాతం సమర్థత (ఎఫికసీ), సాధారణ ఉష్ణోగ్రతలో నిలువ ఉంచగలగడం, అందరికీ అందుబాటులో ధర ఎక్కువ కాలం నిల్వ ఉండగల ధర్మాలు లాంటి అంశాలు వ్యాక్సీన్ సఫలతను నిర్ణయిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి 60- 70 శాతం ప్రజలకు వ్యాక్సీన్ అవసరం అవుతుంది. డిసెంబర్ 2020లోనే కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం ప్రపంచ టీకాల చరిత్రలో ఓ అద్భుత అధ్యాయమని అందరూ నమ్ముతున్నారు. కరోనా వ్యాక్సీన్ తయారీలో అగ్ర స్థానాల్లో ఉన్న ప్రపంచ, భారత కంపెనీలు అవి రూపొందించే టీకాల పురోగతిని గూర్చి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

ఫిజ్జర్/యోయన్‌టెక్ (యంఆర్‌యన్‌ఎ) వ్యాక్సీన్

ఇప్పటికే యుకె ప్రభుత్వ అనుమతులు పొందిన ‘ఫిజ్జర్ బయోయన్‌టెక్’ కంపెనీ రూపొందించిన ‘బియన్‌టి162బి2’ కోవిడ్ వ్యాక్సీన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సీన్ ప్రయోగాల్లో 95 శాతం వరకు సమర్థవంతంగా (ఎఫికసీ) పని చేస్తుందని తేలింది. యుకెలో 08 డిసెంబర్‌న ప్రథమ వ్యక్తి కండరాలకు మెుదటి టీకా ఇవ్వడం జరిగింది. సాధారణ ప్రజలు వెంటనే వాడడానికి 50 మిలియన్ల వ్యాక్సీన్ డోసులను రాబోయే వారంలో అందుబాటులో ఉంచుతూ, 2021లో 1.3 బిలియన్ డోసులు తయారు చేయనున్నది. వ్యాక్సీన్ అభివృద్ధిలో 43,000 వేల మందికి క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఈ వ్యాక్సీన్‌ను మూడు వారాల్లో రెండవ డోసు కూడా తీసుకోవలసి ఉంటుంది. ఈ వ్యాక్సీన్‌ను నిలువ ఉంచడానికి -70 డిగ్రీల సెంటిగ్రేడ్ ‘డ్రై ఐస్ శీతలీకరణ వసతి అవసరం అవుతున్నది. ఈ టీకా వేసుకున్న వారిలో 2 – 3.7 శాతం మందికి అలసట, 2 శాతం తల నొప్పి లాంటి దుష్ప్రభావాలు కలుగవచ్చు. ఫిజ్జర్ వ్యాక్సీన్ ధర 20 డాలర్లు (రూ: 1,500/-) ఉంటుంది.

మాడెర్నా (యంఆర్‌యన్‌ఎ) వ్యాక్సీన్

ఫిజ్జర్ వ్యాక్సీన్ రూపొందించిన ఆర్‌యన్‌ఎ ప్రక్రియవలె మాడెర్నా టీకా (యం-ఆర్‌యన్‌ఎ -1273) కూడా అదే విధంగా తయారు చేశారు. కండరాలకు వేసే మాడెర్నా సమర్థత 94.5 శాతం ఉందని, యుకె ప్రభుత్వానికి 5 మిలియన్ డోసులు సిద్ధం చేస్తున్నామని కంపెనీ తెలిపింది. నాలుగు వారాల్లో రెండు డోసులు తీసుకోవలసి ఉంటుందని, 30,000 వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశామని తెలిపారు. ఈ వ్యాక్సీన్‌ను 6 నెలలు నిలువ ఉంచడానికి 2 – 8 డిగ్రీల సెంటిగ్రేడ్ అవసరం అవుతుంది. 2020 చివరి వరకు యుయస్‌లో వినియోగానికి 20 మిలియన్ డోసులు సిద్ధం చేస్తున్నారు. ఇండియాలో ‘కోవాక్స్’ పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ వ్యక్సీన్ ట్రయల్స్ దశలో 9.7 శాతం మందికి అలసట, 8.9 శాతం కండరాల నొప్పి, 5.2 శాతం కీళ్ళ నొప్పులు, 4.5 తల నొప్పి లాంటి దుష్ప్రభావాలు బయటపడ్డాయి. దీని ధర 37 డాలర్లు (రూ: 2,750/-) ఉండనుంది.

ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్

ఆక్స్‌ఫర్డ్/ ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సీన్ (ఏజడ్‌డి 1222) సమర్థత 70 శాతం వరకు ఉందని, రెండు దఫాలుగా వేసుకోవలసి ఉంటుందని తేల్చారు. క్లినికల్ ట్రయల్స్ కోసం 20,000లకు పైగా ప్రజలు ముందుకు వచ్చారు. యుకె ప్రభుత్వం ఇప్పటికే 100 మిలియన్ల డోసులను ఆర్డర్ చేసింది. ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమన్వయంతో ‘కొవిషీల్డ్’ పేరుతో త్వరలో అందుబాటులోకి రానుంది. కండరాలకు వేసే ఈ వ్యాక్సీన్ 2021 ఏప్రిల్ వరకు భారత్‌లో 30 – 40 కోట్ల డోసులు తయారు చేస్తారని తెలుస్తున్నది. ఈ వ్యాక్సీన్ వాడిన వారిలో సూది వేసిన చోట నొప్పితో పాటుగా అలసట, తల నొప్పి, జ్వరం, కండరాల నొప్పి లాంటి దుష్ప్రభావాలు కనిపించాయని కంపెనీ తెలిపింది. ఈ వ్యాక్సీన్‌ను నిలువ చేయడానికి 2 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు ధర రూ:500 నుంచి 600/- (3 డాలర్లు) వరకు ఉండనుంది.

మాడెర్నా (యంఆర్‌యన్‌ఎ) వ్యాక్సీన్

ఫిజ్జర్ వ్యాక్సీన్ రూపొందించిన ఆర్‌యన్‌ఎ ప్రక్రియ వలె మాడెర్నా టీకా కూడా అదే విధంగా తయారు చేశారు. మాడెర్నా సమర్థత 94.5 శాతం ఉందని, యుకె ప్రభుత్వానికి 5 మిలియన్ డోసులు సిద్ధం చేస్తున్నామని కంపెనీ తెలిపింది. నాలుగు వారాల్లో రెండు డోసులు తీసుకోవలసి ఉంటుందని, 30,000 వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశామని తెలిపారు. ఈ వ్యాక్సీన్‌ను 6 నెలలు నిలువ ఉంచడానికి 2 – 8 డిగ్రీల సెంటిగ్రేడ్ అవసరం అవుతుంది. 2020 చివరి వరకు యుయస్‌లో వినియోగానికి 20 మిలియన్ డోసులు సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ దశలో 9.7 శాతం మందికి అలసట, 8.9 శాతం కండరాల నొప్పి, 5.2 శాతం కీళ్ళ నొప్పులు , 4.5 తల నొప్పి లాంటి దుష్ప్రభావాలు బయటపడ్డాయి. దీని ధర 37 డాలర్లు (రూ: 2,750/-) ఉండనుంది.

భారత్ బయోటెక్ కోవాక్సీన్ టీకా

భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ భారత్ బయోటెక్, ఐసియంఆర్ సంయుక్తంగా రూపొందిస్తున్న ‘కోవాక్సీన్’ టీకా పరిశోధనలు అంతిమ దశ- 3లో ఉన్నాయి. ఈ వ్యాక్సీన్ సమర్థత 60 శాతం వరకు ఉందని, 2021 ప్రథమార్థంలో మార్కెట్‌లోకి రావచ్చని అంటున్నారు. ఒక వేళ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి లభిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే దేశంలోన 18 కేంద్రాలలో 22,000 మంది వాలంటీర్లతో క్లినికల్ ట్రయల్స్ చేశారు. కోవాక్సీన్ సమర్థత, భద్రతలను డిసిజిఐకి సమర్పిస్తే అనుమతులు వెంటనే వస్తాయని అంటున్నారు.

స్పుత్నిక్ V వ్యాక్సీన్

రష్యా రూపొందించిన స్పుత్నిక్- V వ్యాక్సీన్ సమర్థత 91 శాతమని, 40,000 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశామని కంపెనీ వివరించింది. ఇండియాలో రెడ్డి ల్యాబ్ సమన్వయంతో టీకా అందుబాటులోకి రానుంది. రెండు డోసులుగా తీసుకోవలసిన ఈ వ్యాక్సీన్‌ను నిలువ ఉంచడానికి -మైనస్ 18 డిగ్రీల సెంటిగ్రేడ్ శీతల వాతావరణం అవసరం అవుతుంది. ప్రస్తుతం ఇది పరిమిత సంఖ్యలోనే అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం 58 కంపెనీలు కరోనా వ్యాక్సీన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. వీటిలో నోవవాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సినొవాక్ బయోటెక్, గమలేయా, కాన్‌సినో బయోలాజిక్, సినోఫార్మ్ లాంటి వివిధ కూడా వ్యాక్సీన్ తయారీలో ముందుండడం సంతోషదాయకం. ఇండియాలో ఆస్ట్రాజెనెకా 1,000 మిలియన్లు, నోవావాక్స్ 1,000 డోసులు, గమలేయా 200 మిలియన్ల డోసుల వ్యాక్సీన్‌లను అందుబాటులోకి తేనున్నాయి. కరోనా విష కోరల్లోంచి విశ్వమానవాళి బయట పడటానికి అన్ని కంపెనీలు సమర్థవంతమైన టీకాలను సత్వరమే రూపొందించి సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని కోరుతుందాం. కరోనా వ్యాక్సీన్ వేసుకున్న వెంటనే స్వేచ్ఛగా తిరగకుండా, రెండు డోసులు వేసుకునే వరకు లేదా ఆంటీబాడీలు ఏర్పడే 3 వారాల వరకు సామాజిక దూరాలు, మాస్కుల ధారణలు కొనసాగించాలని లేని యెడల టీకా వేసుకున్న కొన్ని రోజుల్లోనే కరోనా సోకవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటి కన్న ప్రాణం మిన్నయని జీవిస్తేనే ఏదైనా సాధించగలమని తలచి కరోనాకు దూరంగా బాధ్యతగా పోరాడుతూ కరోనాను నిర్దయగా ఓడిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News