Monday, April 29, 2024

పోలీసులు మాకు శత్రువులు కాదు

- Advertisement -
- Advertisement -

27 Naxals surrender in Chhattisgarh

పోలీసులు మాకు శత్రువులు కారు
ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు
పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం
బందీగా ఉన్న రాకేశ్వర్‌ను విడిచిపెడతాం
మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ ఎన్‌కౌంటర్ ఘటనపై స్పందించిన మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మంగళవారం ఒక లేఖ విడుదల చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులు ఒక్కసారిగా మాపై దాడి చేశారని, పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు తమకు శత్రువులు కాదని, చనిపోయిన పోలీసు వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు నక్సల్స్ తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులు మావోయిస్టుల ఏరివేత, నియంత్రించేందుకు పథకం రచించారని, ఇందులో భాగంగానే 2వేల మంది పోలీసులు తమపై దాడికి దిగడంతో తాము ప్రతిదాడి చేశామని, ఈ ఎదురుకాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించారు. ఓ పోలీసు మాకు బందీగా దొరికారు‘ అని మావోలు లేఖలో పేర్కొన్నారు. కాగా మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తేనే బందీగా ఉన్న పోలీసుని అప్పగిస్తామని మావోయిస్టులు స్పష్టం చేశారు. పేర్లు ప్రకటించే వరకు పోలీసు తమ వద్ద క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు కూడా మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు తమకు శత్రువులు కాదని, చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు నక్సల్స్ పేర్కొన్నారు. చర్చలకు తాము ఎప్పుడూ సిద్దమేనని, ప్రభుత్వమే చిత్తశుద్ధి లేనట్లుగా ప్రవర్తిస్తుందని తెలిపారు.


రాకేశ్వర్‌ను విడిచిపెడతాం:
బీజాపూర్ ఎన్‌కౌంటర్ సమయంలో బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ ప్రకటించింది. మధ్యవర్తుల పేర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే రాకేశ్వర్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. అప్పటివరకు తమ దగ్గరే రాకేశ్వర్ సురక్షితంగా ఉంటాడని మావోయిస్ట్ కమిటీ స్పష్టం చేసింది.
కీలక మావోయిస్టు ఏరివేతకు వ్యూహం ః మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్ల పట్ల మావోయిస్టుల ఘాతుకానికి దీటుగా బదులిచ్చేందుకు, వారిపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా, భద్రతా బలగాలను ట్రాప్ చేసిన మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మా లక్ష్యంగా ’ఆపరేషన్ ప్రహార్-3’ చేపట్టనుంది. హిడ్మాతో పాటు 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ జాబితాను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రక్షణా బలగాల ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో, మావోయిస్టులతో చేతులు కలిపి, వారితో భాగస్వామ్యమయ్యే వ్యక్తులను గుర్తించాలని కేంద్ర హోం శాఖ జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా హిడ్మా వంటి కీలక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొత్త ఆపరేషన్‌కు ఉపక్రమించింది.

 

Maoist Committee releases Letter on Jirragudem attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News