Saturday, April 27, 2024

ఇద్దరు గ్రామస్థులను హత్య చేసిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

నారాయణ్‌పూర్ /సుక్మా : చత్తీస్‌గఢ్ లోని మావోయిస్టుల ప్రభావిత బస్తర్ డివిజన్‌లో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు హత్య చేశారని అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల్లో ఒకరు మాజీ ఉపసర్పంచ్. ఈ రెండు సంఘటనలు మంగళవారం రాత్రి జరిగాయి. నారాయన్‌పూర్ జిల్లాలో రామ్‌జీ డోడి హత్యకు గురికాగా, సుక్మా జిల్లాలో మడకం రాజు బలయ్యాడు. వీరిద్దరూ పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే అనుమానంతో నక్సల్స్ హత్య చేశారని అధికారులు పేర్కొన్నారు. ధనోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఝారా గ్రామానికి చెందిన డోడి మాజీ ఉపసర్పంచ్.

తన ఇంటివద్దనే అతని గొంతుకోసి నక్సల్స్ చంపివేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డోడి తన బంధువుల ఇంటికి కాలినడకన వెళ్తుండగా, 12 మంది నక్సల్స్ ముఠా అతడిని, అతడి కుటుంబ సభ్యులు మరో ఇద్దరిని బంధించి అడవి లోకి తీసుకెళ్లారు. అక్కడ డోడిని చంపేసిన తరువాత మృతదేహాన్ని ఇద్దరి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతోపాటు కరపత్రం కూడా ఇచ్చారు. అందులో డోడి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని ఆరోపించారు. సుక్మా సంఘటనకు సంబంధించి భేజి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒంధెపర గ్రామంలో తన ఇంటిలో నిద్రిస్తున్న రాజు అనే వ్యక్తిని నక్సల్స్ పదునైన ఆయుధాలతో నరికి వేశారు. అక్కడ దొరికిన కరపత్రంలో కొంటా ఏరియా మావోయిస్టులు బాధితుడు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఆరోపించారు. ఈ సంఘటనల తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News