Saturday, April 27, 2024

మావోయిస్టుల భారీ విధ్వంసం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మంచిర్యాల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. గత వారం రోజులుగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య ప్రతీకార చర్యలు రగులుతుండగా బుధవారం ఉదయం మావోయిస్టులు చత్తీస్‌ఘడ్ నుండి ఇసుకలోడ్‌తో వస్తున్న నాలుగు లారీలను దహనం చేశారు. గడ్చిరోలి జిల్లాలోని బాంబ్రఘడ్ తాలుక సావర్‌గామ్ అడవుల సమీపంలో గల జాతీయ రహదారిపై చెట్లను నరికి అడ్డంగా వేసి చతీస్‌ఘడ్ ‌నుండి ఇసుక లోడ్‌తో వస్తున్న నాలుగు లారీలను నిలిపివేసి లారీల నుంచి డీజల్ తీసి నిప్పంటించారు.

ఈసంఘటనలో దాదాపు రూ.కోటి నష్టం వాటిల్లినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గడ్చిరోలి జిల్లాలోని బాబ్రఘడ్ అడవుల్లో గత రెండు రోజుల క్రితం మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ప్రోబెషినరి ఎస్‌ఐతో పాటు మరో కానిస్టేబుల్ ‌మృతి చెందారు. అప్పటి నుండి సి60 బలగాలను మోహరింపజేసి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయగా మరోవైపు మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం మావోయిస్టు అగ్రనేత సృజనకు సంతాపసూచికంగా మావోయిస్టులు గడ్చిరోలి జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడడం పోలీస్ వర్గాలను కలవరానికి గురి చేసింది.

Maoists set up fire to 4 lorries in Gadchiroli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News