Tuesday, April 30, 2024

మేరీకోమ్‌కు రజతం

- Advertisement -
- Advertisement -

Mary Kom won silver in Asian Boxing Championships

 

దుబాయి: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ మహిళల విభాగంలో రజతం సాధించింది. ఆదివారం జరిగిన 51 కిలోల విభాగం ఫైనల్లో మేరీకోమ్ ఓటమి పాలైంది. కజకిస్థాన్ బాక్సర్ నజీమ్‌తో జరిగిన తుది పోరులో మేరీకోమ్ పరాజయం ఎదురైంది. ఈ చాంపియన్‌షిప్‌లో ఎలాగైనా పసిడి పతకం సాధించాలనే పట్టుదలతో కనిపించిన మేరీకోమ్ రజతంతోనే సంతృప్తి పడక తప్పలేదు. కజకిస్థాన్‌కు చెందిన యువ బాక్సర్ నజీమ్ ఆరంభం నుంచే పదునైన పంచ్‌లతో భారత దిగ్గజం మేరీకోమ్‌ను హడలెత్తించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అసాధారణ ఆటతో అలరించిన నజీమ్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇక ఓటమి పాలైన మేరీకోమ్‌కు రజతం దక్కింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News