Sunday, April 28, 2024

శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం కేసులో మూడు దరఖాస్తులు దాఖలు

- Advertisement -
- Advertisement -

Sri Krishna Janmabhoomi
మథుర (యుపి): శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం కేసులో ఇక్కడి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో మూడు దరఖాస్తులు దాఖలయ్యాయి.  మసీదు ఆవరణలో యథాతథ స్థితిని కొనసాగించాలన్న  అభ్యర్థన దరఖాస్తు కూడా అందులో ఉందని  అధికారులు తెలిపారు.

మసీదును మార్చాలన్న  2020లో  శ్రీకృష్ణుడి వారసుడని చెప్పుకునే లక్నో నివాసి మనీష్ యాదవ్ పేరిట దాఖలైన దావాలో భాగంగా జ్యోతి సింగ్ కోర్టులో ఈ దరఖాస్తులు సమర్పించబడ్డాయి. కాట్రా కేశవ్ దేవ్ ఆలయానికి చెందిన 13.37 ఎకరాల స్థలంలో మసీదు నిర్మించబడిందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనికి ముందు మసీదును సర్వే చేయాలంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. వేసవి సెలవుల తర్వాత కోర్టులను పునఃప్రారంభించడంపై తదుపరి విచారణను జూలై 1గా కోర్టు నిర్ణయించింది.

జిల్లా ప్రభుత్వ న్యాయవాది (సివిల్) సంజయ్ గౌర్ శుక్రవారం మాట్లాడుతూ మూడు కొత్త దరఖాస్తులు ఈ అంశాలను డిమాండ్ చేశాయని తెలిపారు: ఎ) మసీదు ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించడం, బి) ఇద్దరు అసిస్టెంట్ అడ్వకేట్ కమీషనర్‌లను నియమించడం,  సి) అడ్వకేట్ కమిషనర్  మసీదును అక్కడికక్కడే తనిఖీ చేసేప్పుడు ఆ సమయంలో జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని ఆదేశించడం. ఇదిలావుండగా  స్టేటస్ కో అప్లికేషన్‌లో, మసీదు లోపల హిందూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని “ముఖ్యమైన చిహ్నాలు” ఖననం చేయబడ్డాయని పిటిషనర్లు పేర్కొన్నారు. కోర్టుకు సుదీర్ఘ వేసవి సెలవుల సమయంలో ఈ సంకేతాలు పాడుచేయడం, వికృతీకరించడం లేదా తొలగించడం వంటివి జరుగుతాయని పిటిషనర్ తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.

మొదటి దరఖాస్తులో మసీదు ప్రాంగణంలో యథాతథ స్థితిని నెలకొల్పడమే ఏకైక పరిష్కారమని న్యాయవాది డిమాండ్ చేశారు.
రెండవ దరఖాస్తు విషయంలో న్యాయవాది మాట్లాడుతూ, మసీదు యొక్క పెద్ద విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని, స్పాట్ ఇన్‌స్పెక్షన్ సమయంలో సీనియర్ అడ్వకేట్ కమిషనర్‌కు సహాయం చేయడానికి ఇద్దరు అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్‌లను నియమించాలని,  వారి స్వంత స్వతంత్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని కోర్టును అభ్యర్థించారు.

మూడవ దరఖాస్తులో స్పాట్ ఇన్స్పెక్షన్ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్, మథుర చీఫ్ మెడికల్ ఆఫీసర్, మేయర్ హాజరు కావాలని కోర్టును అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News