Thursday, May 16, 2024

శ్రీకృష్ణ జన్మభూమి అంశంపై సుప్రీం కీలక ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

లక్నో: శ్రీకృష్ణ జన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మధురా షాహీ ఈద్గా మసీదులో సర్వేకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్లు వేశారు. ఆర్కియాలజీ నిపుణులతో సర్వే జరపాలని సుప్రీం తీర్పు వెల్లడించింది.

మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి జౌరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని గతంలో హిందూ తరఫున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని హిందూ సంస్థలు కోరాయి. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటిషన్లు దాఖలయ్యాయి. షాహీ ఈద్గా మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.  శ్రీకృష్ణుడు జన్మించినప్రదేశంలో మసీదును నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. దీనిపై సర్వే చేపట్టాలని చాలా సంవత్సరాలుగా డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News