Saturday, April 27, 2024

అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాటర్ మాథ్యూ వేడ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. టెస్టు ఫార్మెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, వేడ్ తన కెరీర్‌లో సుదీర్ఘ ఆట, తనకు ఎదురైన సవాళ్లు, అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. 36 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన ఎడమచేతి వాటం బ్యాటర్ 29.87 సగటుతో నాలుగు సెంచరీలతో సహా 1613 పరుగులు చేశాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్ లో టాస్మానియా-వెస్టర్న్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న స్టార్ట్ ఫైనల్ మ్చాల్ రెడ్ బాల్ క్రికెట్ లో తనకు చివరిదని వేడ్ తెలిపాడు. ఇక మాథ్యూ వేడ్ 2012 లో అతడు టెస్టు క్రికెట్ తో కెరియర్ ప్రారంభించాడు.

లాంగ్ ఫార్మాట్ లో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు వేడ్. టీ-20 ఫార్మాట్‌ లో అతనికి ఫినిషర్‌గా రికార్డు ఉంది. టీ-20 ప్రపంచ కప్ 2021లో ఆస్ట్రేలియా విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై కేవలం 17 బంతుల్లో 41 పరుగులతో అతని మెరుపు ప్రదర్శనతో టీమ్ ను ఫైనల్ కు చేర్చాడు. 36 సంవత్సరాల వేడ్ టీ-20 వరల్డ్ కప్-2024 లో సత్తా చాటాలని బావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రిటర్మెంట్ ప్రకటించాడు. ఐపిఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న అతను తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News