Saturday, April 27, 2024

భీకర కార్చిచ్చుతో బూడిదైన లహైనా నగరం.. మృతుల సంఖ్య 93కు చేరిక

- Advertisement -
- Advertisement -

లహైనా : అమెరికా లోని హవాయి దీవిలో భీకర కార్చిచ్చు కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 93 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య ఇంకా తెలియవలసి ఉందని అధికారులు చెప్పారు. రెండు చోట్ల కార్చిచ్చు మంటలు ఇంకా పూర్తిగా అదుపు లోకి రాలేదు. ఇందులో ఒకటి చారిత్రక నగరం లహైనాను పూర్తిగా దగ్ధం చేసింది. మంటలు అదుపు లోకి వచ్చిన ప్రాంతాల్లో విషజ్వాలలు వల్ల విషపదార్థాలు ఇంకా తాగునీటిలోను, ఇతర చోట్ల మిగిలే ఉంటాయని, ప్రజలను అధికారులు హెచ్చరించారు.

లహైనా రిసార్టు నగరంలో మృతదేహాలను వెలికి తీసే చర్యలు ఇంకా ప్రారంభదశ లోనే ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మృతదేహాలను గుర్తించే దాదాపు 20శునకాలను రంగం లోకి దింపారు. చాలా మంది తమ ఇళ్లను కార్లను బూడిద కుప్పల్లో వెతుకుతున్నారు. 13 వేల మంది నివసించే ప్రాచీన లహైనా నగరంలో ప్రతి భవనం కార్చిచ్చుకు దగ్ధమైంది. గత వందేళ్లలో ఇంత భయంకర కార్చిచ్చును చూడలేదని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News