Tuesday, April 30, 2024

మరింత అప్రమత్తంగా ఉండండి

- Advertisement -
- Advertisement -

Mayor Vijayalaxmi review meeting with Zonal Commissioners

జోనల్ కమిషనర్లకు మేయర్ అదేశం

హైదరాబాద్: నగరంలో ఏడతెరపి లేకుండా  కురుస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మంగళవారం నగరంలో నెలకొన్న పరిస్థితులు, సహాయక చర్యలపై జోనల్ కమిషనర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతు గత నాలుగు రోజల నుండి వర్షం ఏకదాటిగా కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. నగరంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే తొలగించడంతో పాటు నాలలో పేరుకొని పోయిన చెత్త, మ్యాన్ హోల్స్ వద్ద చెత్త గాని మట్టి గాని ఉంటే తొలగించి సాఫీగా వరద పోయే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. ప్రజల నుంచి పిర్యాదులు వచ్చిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు.

అధికారులందరూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ పిర్యాదు వచ్చిన వెంటనే క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాల నేపథ్యంలో ఒకే రోజులో 7సెంటి మీటర్ల వర్షం కురిసినా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుంట చర్యలు తీసుకోవడం అభినందనీయమని, అదే స్ఫూర్తి తో భవిష్యత్‌లో కూడా అంత కంటే ఎక్కువ కురిసిన ఎదుర్కునే విధంగా సిద్దంగా ఉండాలని మేయర్ అధికారులకు సూచించారు. మూసి నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని మేయర్ సూచించారు రాబోయే 24 గంటలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు కరెంటు పోల్స్ దగ్గర, చెట్ల కింద, నాలా పరిసర ప్రాంతాల్లో నిలబడకుండా చూడడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు రవి కిరణ్, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమత, పంకజ, అశోక్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News