Monday, April 29, 2024

అధ్యక్ష పదవికి సిఎం కెసిఆర్ పేరును ప్రతిపాదించిన అన్నీ కార్పొరేషన్‌ల మేయర్లు

- Advertisement -
- Advertisement -

Mayors of all corporations who nominated CM KCR for TRS presidency

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన అన్నీ కార్పొరేషన్‌ల మేయర్లు, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కెసిఆర్ తరపున నామినేషన్ దాఖలు చేసి ఆయన పేరును ప్రతిపాదించారు. అనంతరం వారు మంత్రి కెటిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, ఖమ్మం మేయర్ నీరజ, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, నిజాంపేట్ మేయర్ నీల గోపాల్ రెడ్డి, ఫీర్జాదిగుడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బొడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, బడంగ్‌పేట మేయర్ పారిజాత నరసింహ రెడ్డిలు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ మళ్లీ తమ పార్టీ అధ్యక్షుడు కావాలని, రాష్ట్ర రాజకీయాలను స్వచ్ఛంగా నడపాలంటే ప్రజలను, నాయకులను సరైన మార్గంలో నడిపించాలంటే తమ అభిమాన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని వారు పేర్కొన్నారు. అందులో భాగంగానే తాము సిఎం కెసిఆర్ తరుపున నామినేషన్ దాఖలు చేశామని వారు తెలిపారు.

ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజం

సిఎం కెసిఆర్ బంగారు తెలంగాణ కోసం కలలు కన్నారని, దానిని నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఆయనకు మద్ధతుగా కోట్లాది మంది ప్రజానీకం ముందుకు వస్తున్నారన్నారు. కెసిఆర్ ఉద్యమం సమయంలోనూ ఎన్నోసార్లు పదవులను తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ ఉద్యమానికి ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజం తీసుకొచ్చారన్నారు. అందరిని ఐక్యం చేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారని వారు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ప్రజలందరూ కెసిఆర్ వెన్నంటి ఉన్నారన్నారు. పబ్ల్లిక్ కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఉద్యమ ఆకాంక్షలు తెలిసిన కెసిఆర్ తమ మద్ధతు తెలిపామని వారు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఆశలకు అనుగుణంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు అంశాలను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళుతున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్న వారికి అభివృద్ధితోనే సిఎం కెసిఆర్ సమాధానం చెబుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News