Saturday, April 27, 2024

ఇంటింటికి చుక్క..ముక్క!

- Advertisement -
- Advertisement -

మునుగోడులో ఏరులై పారుతున్న మద్యం
గ్రామాల్లో నాన్ వెజ్ వంటకాలతో
రాజకీయ నాయకుల విందులు

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి : నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక అధికార టిఆర్‌ఎస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చాలా కీలకంగా మారాయి. దీంతో అన్ని పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా ఆలోచించి ఎలాగైనా సరే ఓటర్లను ప్రభావితం చేసి తమవైపు తిప్పుకొనేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టుతున్నారు, అదే కాకుం డా ఎవరికీ వారే ప్రలోభాలకు తెరతీసినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం కొనసాగుతున్న సమయంలో నాన్ వెజ్ వంటకాలతో అటు ఓటర్లకు ఇటు నాయకులకు విం దులు ఏర్పాటు చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యం లో టిఆర్‌ఎస్ అధిష్టానంతో పాటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సైతం ఇతర ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులను ఇంచార్జ్ లుగా ఆయ పార్టీల అధిష్టానం నియమించింది. సమావేశాలు, విందులు మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా ఆయ గ్రామాల్లో సమావేశా లు, విందులు జోరుగా సాగుతున్నాయి ఇంటింటికి చుక్క, ము క్క పథకాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం మాంసం ఉండడంతో పాటు వారంలో రెండు రోజులు మటన్ ఉండేలా ప్లాన్ చేశారు.

గ్రామాన్ని 12 యూ నిట్లుగా చేసి దాని పరిధిలోని చురుకైన కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేశారని సమాచారం. బృందాలుగా ఏర్పడిన వారంతా.. ఓటర్ల వివరాలు సేకరించడం.. వారిని ప్రలోభాల కు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు వస్తున్నా యి. గతంలో కూడా ఇంట్లో సామగ్రి అనేక పరికరాలతో పా టు గ్రామానికి ఓ లీడర్ చేత డబ్బులు పెట్టించి గెలిచిన కొన్ని రోజుల తరువాత అప్పటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి బిజెపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పంచారనే ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News