Saturday, April 27, 2024

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మెడల్

- Advertisement -
- Advertisement -

అభినందించిన పోలీస్ కమిషనర్

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షీప్ పోటీల్లో పతకం సాధించిన శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థి గుండు సూర్య ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఖమ్మం నగరంలోని టిఎన్జీవో ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 46కేజీల విభాగంలో స్నాచ్, 66 కేజిల క్లీన్, జర్క్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి గుండు సూర్య సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనాన్, ప్రిన్సిపల్ శేషగిరిరావు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News