Monday, April 29, 2024

పైన ఆసుపత్రి.. కింద మద్యం దుకాణం… నిబంధనలు బేఖాతరు

- Advertisement -
- Advertisement -

విమర్శలకు తావిస్తున్న ఎక్సైజ్ ఆధికారుల తీరు
సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైన్‌షాప్‌పై ఫిర్యాదు చేసిన శ్రీకర ఆసుపత్రి యజమాన్యం

మన తెలంగాణ / సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైతిఫైల్ బస్టాండ్‌కు సమీపంలో ఏర్పాటు చేస్తున్న మ ద్యం దుకాణం వివాదాస్పదంగా మారింది. రోగుల కు సేవలందిస్తున్న ఆసుపత్రి ప్రాంగణంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఎక్సైజ్ క మిషనర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ప్రభు త్వ అనుమతి పొందిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. వేలాదిగా రాకపోకలు సాగించే ఈ ప్రదాన రహదారిలో నిబందనలకు విరుద్ధ్దంగా వైన్ షాపు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆనుకొని ఉన్న రేతిఫైల్ బస్టాండుకు సమీపంలో ప్రభుత్వ అనుమతి తో వంద పడకల శ్రీకర సూపర్ స్పెషాలిటీ ఆసుప త్రి ఎంతో కాలంగా రోగులకు సేవలందిస్తున్నది. ఆయితే ఇటీవల ఇదే ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో క్వాలిటీ వైన్స్ పేరుతో మద్యం షాపును ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధ్దంగా ఆసుపత్రికి వంద మీటర్లులోపే ఉన్న ఈ భవనంలో మద్యం షాపును ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీకర ఆసుపత్రి యజమాన్యం ప్రశ్నిస్తున్నారు. మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ అబ్కారీ శాఖ కమిషనర్‌కు వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ప్రజలకు ఇరవైనాలుగు గంటలు సేవలందిస్తున్న శ్రీకర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధ్దంగా ఏర్పాటు చేసిన మద్యం షాపును ఇక్క డ నుండి తరలించాలని వారు లేఖలో కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మద్యం షాపు మూలంగా భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, మందుబాబులు తప్పతాగి ఆసుపత్రికి వచ్చే రోగులకు, ఇన్‌పేసెంట్స్‌ల మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే ఆవకాశం ఉందని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైన్ షాపును తొలగించాలని, భవిష్యత్తులో ఆసుపత్రి భవనంలో మద్యం షాపు ఏర్పా టు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News