Saturday, April 27, 2024

అమర జవాన్లకు గుర్తుగా స్మారక చిహ్నం…

- Advertisement -
- Advertisement -

Memorial

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లెత్ పొరా శిభిరంలో స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ స్థూపంపై 40 మంది జవాన్ల పేరు, ఫోటోలను ముద్రించారు. అమరవీరులకు ఇదే అసలైన నివాళి అని సిఆర్పీఎఫ్ ఐజీపీ జుల్ఫికర్ హసన్ తెలిపారు. మాతృభూమి కోసం గొప్ప త్యాగం చేసిన ధీర జవాన్లు, వారి కుటుంబాల పట్ల భారత్ గర్వపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

అటు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. ”గత ఏడాది జరిగిన దారుణమైన పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ధైర్య అమరవీరులకు నివాళులు. వారు మన దేశానికి సేవ చేయడానికి, రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు. భారతదేశం ఈ అమరులను ఎప్పటికీ మరచిపోదు” మోడీ ట్వీట్ చేశారు.

Memorial For 40 CRPF Soldiers Killed In Pulwama Attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News