Thursday, May 16, 2024

మధ్యాహ్న భోజనం డిగ్రీ విద్యార్థులకు వరం: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Mid day meals to degree students at Telangana

 

వనపర్తి: ఇంటర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హర్షణీయమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత పాలకులు విద్యను వ్యాపారం చేశారని మండిపడ్డారు. విద్య, వైద్య, సంక్షేమం, వ్యవసాయ రంగాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వరమని, సన్న బియ్యం అన్నంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగిందని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు అంటూ ధర్నాలు, రాస్తారోకోలతో విద్యార్థులు రోడ్లెక్కిన పరిస్థితి ఉండేదన్నారు. సిఎం కెసిఆర్ ముందుచూపుతో విద్యార్థులకు అలాంటి దుస్థితి లేదని సింగిరెడ్డి పేర్కొన్నారు. అరవై ఏళ్లలో 280 గురుకులాలు ఉంటే ఆరేళ్లలో 550కి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బాలికలకు హెల్త్ కిట్లు, మధ్యాహ్నం భోజనం, గురుకులాలు, సన్నబియ్యం అన్నం, భావి పౌరులు పట్ల ప్రభుత్వ భాద్యతకు నిదర్శనమని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News