Friday, April 26, 2024

ఓటేశారనే కోపంతో బోకో హరామ్ ఘాతుకం

- Advertisement -
- Advertisement -

Militants killed at least 40 farmers in Nigeria

 

నైజీరియాలో 40 మంది రైతుల కాల్చివేత

మైడ్‌గురి : నైజీరియాలో అనుమానిత ఉగ్రవాదులు నరమేధానికి దిగారు. బోకో హరామ్ ఇస్లామిక్ మిలిటెంట్ బృందానికి చెందిన వారిగా అనుమానిస్తున్న మిలిటెంట్లు కనీసం 40 మంది రైతులను చంపివేశారు. మృతులలో కొందరు మత్సకారులు కూడా ఉన్నారని వెల్లడైంది. నైజీరియాలోని ఉత్తరాది బోర్నో రాష్ట్రంలో ఈ ఘాతుకం చోటుచేసుకుందని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. గరిన్ వాషబే ప్రాంతంలో వరి పంట పొలాల్లో రైతులు ఉన్నప్పుడు బోకో హరామ్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ ప్రాంతానికి చెందిన బోర్నో తెగ వారు ఎక్కువగా వరి పంట పండిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 ఏండ్లలో తొలిసారిగా ఈ ప్రాంతవాసులు ఓటేయడానికి వెళ్లుతున్న దశలో పంట పొలాలపై ఉగ్రవాదులు విరుచుకుపడి రైతులను చంపివేసినట్లు వెల్లడైంది.

నిజానికి దాడికి గురైన రైతులలో అత్యధికులు ఓటు వేయడానికి వెళ్లనేలేదు. సాయుధులు పొలాల్లోకి చొరబడి రైతులను చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు , ఇది అత్యంత పైశాచిక మారణకాండగా నిలిచినట్లు వరి రైతుల సంఘం నేత మలామ్ జబర్‌మరి స్పందించారు. ఇప్పటివరకూ 40 మంది చనిపోయినట్లు తెలిసిందని, ఈ సంఖ్య 60వరకూ చేరుకోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యాకాండ పట్ల నైజీరియా దేశాధ్యక్షులు ముహమ్మద్ బుహారీ ప్రగాఢ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పనిచేసే రైతులను ఈ విధంగా దారుణంగా హతమార్చడం గర్హనీయం అని ఖండించారు. ఇది పనికిమాలిన పిచ్చిచేష్ట అని, ఈ ఘటన పట్ల దేశమంతా ఆవేదన చెందుతోందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తున్నట్లు, మృతుల ఆత్మలకు శాంతి కలుగాలని ప్రజలతో పాటు తానూ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News