Monday, April 29, 2024

జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

- Advertisement -
- Advertisement -

Kashmir

శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే ఈ ఘటన వెలుగుచూసింది. ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్ కుల్గాం ప్రాంతంలోని గోపాల్‌పురా గ్రామం ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి దూరి మరీ ఉపాధ్యాయురాలిని గాయపరిచారు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయింది. ఆ లేడీ టీచర్‌ను రజనీగా గుర్తించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆమె జమ్మూలోని సాంబ నివాసి. ఇదిలావుండగా కశ్మీర్ పండిత్ ఉద్యోగి రాహుల్ భట్‌ను అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొంది అన్న బిజెపి వాదనను తప్పని రుజువుచేసిందని కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. కాగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా ఈ హత్యను విషాధం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ కూడా చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News