Friday, April 26, 2024

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

Memicry artist harikishan passes away

 

హైదరాబాద్: ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్ తుది శ్వాస విడిచారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయారని బంధువులు తెలిపారు. హరికిషన్ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మిమిక్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 1963 మే 30న ఏలూరులోని విఎల్‌ఎన్ చార్యులు, రంగమణి దంపతులకు జన్మించాడు. మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో మిమిక్రీ రంగంలోకి వచ్చారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పని చేశారు. టాలీవుడ్ లో పాతతరంలో హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,  శోభన్ బాబు మొదలుకొని మధ్య తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్  పాటు కొత్త తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి గొంతులను మిమిక్రీ చేసి అలరించేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News