Saturday, April 27, 2024

ప్రతి గ్రామంలో బాలల రక్షణ కమిటీలు : మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli participated in VCPC awareness conference

కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన గ్రామ బాలల రక్షణ (విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలల రక్షణ కర దీపికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ చైర్మన్ గా, అంగన్వాడి టీచర్ కన్వీనర్ గా, గ్రామ స్కూల్ హెడ్ మాస్టర్, ఎంపీపీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. గ్రామ స్థాయిలోనే బాలలను రక్షించాలని ప్రభుత్వం గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో ఈ కమిటీలు ఉంటాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు కావాలి. ఇంకా కొన్ని గ్రామాల్లో కమిటీలు వేయాల్సి ఉంది. ఈ కరీంనగర్ జిల్లాలోనే 313 కమిటీలున్నాయి. గ్రామాల్లో ఈ కమిటీలు బాగా పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

అందుకే బాలల హక్కుల కమిషన్ నుంచి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలోనే బాలల రక్షణ జరగాలి. పోలీస్ స్టేషన్, కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి రావద్దు. రాష్ట్ర స్థాయి దాకా సమస్యలు పోవద్దు. అంటే, సర్పంచులు ఆక్టివ్ గా పని చేయాలన్నారు. ఇక్కడ కమిషన్ చెప్పిన విధంగా మార్గదర్శకాలు, సూచనలు పాటించాలని ఆదేశించారు. బాలలను కార్మికులుగా, ఇండ్లలో పనులకు పెట్టుకోవడం వంటి వాటిని నివారించాలి. చదువుకునే వయసు పిల్లలు కచ్చితంగా స్కూల్ లో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో చెప్పినట్లుగా నిర్బంధ విద్యను అందించాలి, అందుకు మనమంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, రసమయి బాలకిషన్, జెడ్పి చైర్మన్ విజయ, కరీంనగర్ మున్సిపల్ మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News