Saturday, May 4, 2024

రాష్ట్రంలో మొత్తం 5 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

 

కారోనా వైరస్ కట్టడికి నిరంతరం కృషి కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సాయంత్రం కరోనా వైరస్ పై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా కరోనా వైరస్ వ్యాప్తిపై భయపడవద్దు అని భరోసా కల్పించారు. ప్రభుత్వం ప్రజల వెంట ఉందని విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఎంత డబ్బు అయిన ఖర్చు పెడతామన్నారు. సిఎం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. వైరస్ వ్యాప్తిని అరికట్టెందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న వారికి ఒక్కరికి కూడా కారోనా లేదు. బయటనుంచి వచ్చిన వారికే కరోనా వచ్చింది. రాష్ట్రంలో మొత్తం ఐదు కారోనా పాజిటివ్ కేస్ నమోదు అయ్యాయి. ఈ విషయంలో మీడియా ఇప్పటివరకు చాలా బాధ్యతగా వ్యవహరించింది ధన్యవాదములు. ఈ నెల మార్చి 2న  దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటీవ్ వచ్చింది. అలాగే ఇటలీ నుంచి వచ్చిన అమ్మాయి, నేదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి పాజిటీవ్ వచ్చింది. ఎయిర్ పోర్ట్ లో 66,182 మందికి పైగా స్క్రీన్ చేసాము. అందులో 464 మందికి లక్షణాలు ఉంటే కేవలం ఐదుగురికే పాజిటీవ్ వచ్చింది. ఎయిర్ పోర్ట్ లొనే పూర్తిగా చేక్ చేసి పంపాలని కేంద్రానికి సూచించాము. ఆఫ్ఘనిస్థాన్, మలేసియా, యూకే, ఫిలిప్పిన్స్ దేశాల నుంచి విమానాలను ఆపేశారు. రేపటి నుంచి మరికొన్ని దేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేసే అవకాశం ఉంది.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని లక్షణాలు ఉన్న లేకపోయినా క్వారంటైన్ చేస్తాము. చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ,కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలనుండి వచ్చినవారిని.. రేపటి నుండి యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ దేశాల నుండి వచ్చే వారిని క్వారంటెన్ చేస్తున్నాము. విదేశాల నుంచి వచ్చే తెలంగాణ వాసులను ఏ జిల్లా వాళ్ళను అదే జిల్లాల్లో ఉంచి క్వరంటైన్ చేసే ఆలోచనలో ఉన్నాము. ఇప్పటివరకు 221 మందిని క్వరంటైన్ సెంటర్ లలో ఉంచాము. వరంగల్, గాంధీ, ఒస్మానియా, ఫీవర్ ఆస్పత్రి, ఐపీఎం, ఎంజీఎంలతో పాటు నిమ్స్ లో కూడా ల్యాబ్స్ ని సిద్ధం చేస్తున్నాము. ఇప్పుడు కారోనా పరీక్షల కోసం రాష్ట్రంలో మొత్తం 6 ల్యాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రజలు వచ్చే ప్రతి మార్గంలో జాగ్రత్తలు వహిస్తున్నాము. దులపల్లి, వికారాబాద్ లో ధర్నా చేస్తున్న వారికి ఒకటే విజ్ఞప్తి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు కరోనా పేషెంట్స్ కాదు.. భయపడాల్సిన అవసరం లేదు. బాధ్యత గల నేతలు ఇలాంటి సమయంలో ప్రజలను భయపెట్టవద్దు. ఇప్పటికి ఒకరు డిశ్చార్జి కాగా, మరో నలుగురికి గాంధీలో చికిత్స అందిస్తున్నాము. విదేశాల నుండి వచ్చే వారు కొంతమంది ఇంట్లోనే క్వారెంటైన్ ఉంటామని అడుగుతున్నారు ఆ విషయం పరిశీలిస్తాం” అని మంత్రి ఈటల తెలిపారు.

Minister Etela Rajender Press Meet on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News