Monday, April 29, 2024

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి షురూ

- Advertisement -
- Advertisement -

Minister Jagadish reopened Units 1, 2 of Srisailam Hydro Power Station

 

విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
పునరుద్ధ్దరణలో ఇంజనీర్ల కృషి శ్లాఘనీయం
మూడు నెలల్లో ఐదు యూనిట్ల ద్వారా ఉత్పత్తి
నాలుగో యూనిట్ మినహా, మిగతా యూనిట్లు అందుబాటులోకి తెస్తాం
పూజలు నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో వి ద్యుత్ ఉత్పత్తి పునరుద్దరణలో జెన్‌కో ఇంజనీయ ర్లు, సిబ్బంది కృషి అభినందనీయమని రాష్ట్ర వి ద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవా టరం ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు, జెన్‌కో డైరెక్టర్లు వెంకటరాజ్యం, అజయ్‌కుమార్, సిఈ హెడల్ సురేష్‌బాబు, ఎస్‌ఎల్‌బిహెచ్‌ఈఎస్ సిఈ ప్రభాకర్‌రావు, ఎస్‌ఈలతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఒకటి, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. మంత్రి జగదీష్ రెడ్డి మొదటగా దుర్గామాత తో పాటు యూనిట్లకు పూజలు నిర్వహించి ప్యా నల్ బోర్డులో స్విచ్ నొక్కి జనరేటర్ రన్ చేశారు. దీంతో ఒకటిరెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. అనంతరం ప్రమాదం లో కాలిన మిగితా యూనిట్లు, ట్రాన్స్‌ఫార్మర్ కా ర్వేన్, మెయిన్ కంట్రోల్‌రూమ్‌ను పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఏ యూనిట్ కు ఎంత మేరకు నష్టం వాటిల్లిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఆగష్టు 20వ తేదిన జరిగిన దురదృష్టకర సంఘటనతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా జెన్ కో ఇంజనీయర్లు, సిబ్బంది సహాయంతో రెండు యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం ఒకటి రెండు యూనిట్ల ద్వారా వి ద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని మిగతా 3,5,6 యూనిట్లను మరో మూ డునెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నాలుగో యూనిట్ విద్యుత్ ప్రమాదంలో ఎక్కువ నష్టం జరిగిందని మే నాటికి నాలుగోయూనిట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఒకటి రెండో యూనిట్ల మరమ్మత్తుకు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని మూడు, ఐదు, ఆరో యూనిట్లకు కాస్తా ఎక్కువ న ష్టం జరిగిందని మొత్తం యూనిట్లు అందుబాటులోకి వచ్చేవరకు వంద కోట్ల రూపాయల లోపే ఖర్చు అవుతుందని భావిస్తున్నామని మంత్రి వివరించారు.

ఇదిలా ఉండగా టైల్‌పాండ్‌కు ప్రభుత్వం 110 కోట్ల రూ పాయల బడ్జెట్ కేటాయించిందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మం త్రి సమాధానమిస్తూ నిపుణుల కమిటీకి నివేదిక కోరడం జరిగిందని టైల్‌పాండ్ బేస్ ఎలా ఉందో వారు ఇచ్చిన నివేదిక తరువాత ఆలోచిస్తామని సమాధానం ఇచ్చారు. ఆగష్టు నెలలో జరిగిన సంఘటనను ఏడుగురు జెన్‌కో అధికారులు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవ డం బాధాకరమని మంత్రి అన్నారు. ఆయనతో పాటు సర్పంచ్ శారద, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సుబ్బారెడ్డి, కుమార్ తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News