Wednesday, May 8, 2024

మాస్ట‌ర్ ప్లాన్ పై మంత్రి కెటిఆర్ స్పష్టత…

- Advertisement -
- Advertisement -

 

హైద‌రాబాద్ : కామారెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ పై మంత్రి కెటిఆర్ స్పందించారు.నిర్మాణాత్మ‌క న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల అభివృద్ధి కోస‌మే మాస్టర్ ప్లాన్ చేశామ‌న్నారు హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కామారెడ్డి జిల్లాలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను ఆ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ను కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు.

కేవ‌లం మాస్ట‌ర్ ప్లాన్ ముసాయిదా మాత్ర‌మే ఇచ్చార‌ని కెటిఆర్ తెలిపారు. అభ్యంత‌రాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. విన‌తులు, అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌న్నారు. ప్ర‌జ‌ల కోణంలోనే ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలిపారు . ప్ర‌జ‌ల‌కు అన్ని విష‌యాలు వివ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. భూమి పోతుంద‌ని ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పత్రిక‌ల్లో చూశాన‌ని తెలిపారు. ఈ ప్ర‌భుత్వం రైతుల‌ను ఇబ్బంది పెట్టేందుకు లేద‌ని స్ప‌ష్టం చేశారు. . మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండాలని వ్య‌తిరేకంగా ఉండొద్దు అని కెటిఆర్ పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News