Monday, April 29, 2024

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR inaugurates Durgam Cheruvu Cable Bridge

హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువుపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్ఎలు అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ఎంపి రంజిత్ రెడ్డి జిహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్ ‌ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ  కేబుల్ బ్రిడ్జిని రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జితో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం తగ్గనుంది. రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌‌కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా పేరు పెట్టారు. ఎస్సార్‌డిపి పనుల్లో భాగంగా జిహెచ్‌ఎంసి దీని నిర్మాణం చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

Minister KTR inaugurates Durgam Cheruvu Cable Bridge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News