Thursday, May 16, 2024

సింగరేణికి కొత్త డైరెక్టర్ల నియామకం

- Advertisement -
- Advertisement -
Appointment of new directors in Singareni Calories Company

 

డైరెక్టర్ (ప్రాజెక్ట్, ప్లానింగ్) గా బి.వీరారెడ్డి
డైరెక్టర్ (ఎక్ట్రికల్ , మెకానికల్) గా డి.సత్యనారాయణ రావు ఎంపిక
చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఇంటర్వ్యూలు

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీలో ఇద్దరు డైరెక్టర్ల పోస్టులకు ఏర్పడిన ఖాళీలను శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షతన ఇంటర్వ్యూలను నిర్వహించారు. తదనంతరం అర్హులను ఎంపిక చేసి ప్రకటించారు. ఈ కమిటీలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు సింగరేణి సిఎం.డి ఎన్.శ్రీధర్, కోలిండియా నుండి సిఎంపిడిఐ, సిఎం.డి. శేఖర్ సరన్, కేంద్రబొగ్గు శాఖ సెక్రటరీ పిఎస్‌ఎల్. స్వామిలు ఉన్నారు. సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్ గా బి.వీరారెడ్డి ని ఎంపిక చేయగా, డైరెక్టర్ (ఇ,ఎం) డి.సత్యనారాయణ రావును ఎంపిక చేశారు.

డైరెక్టర్ (పి,పి)గా ఎంపికైన వీరారెడ్డి ఇంతకు మునుపు అడ్రియాల లాంగ్ వాల్ జనరల్ మేనేజర్ గా పనిచేశారు. డైరెక్టర్ (ఇ,ఎం) గా ఎంపికైన సత్యనారాయణ రావు ప్రస్తుతం భూగర్భ గనుల జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డైరెక్టర్ (పి,పి) పోస్టులకు మొత్తం 5 గురు సీనియర్ జనరల్ మేనేజర్ హోదాలు కలిగిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరిలో బి.వీరారెడ్డితో పాటు జి.వెంకటేశ్వరరెడ్డి, ఎస్.డి.ఎం.సుభానీ, కె.గురువయ్య, హాబీబ్ హూస్సేన్‌లు ఉన్నారు.

కాగా డైరెక్టర్ (ఎక్ట్రికల్, మెకానికల్) పోస్టులకు మొత్తం నలుగురు సీనియర్ జనరల్ మేనేజర్ అభ్యర్ధులను ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరిలో డి.సత్యనారాయణ రావుతో పాటు జి.ఎస్.రాంచంద్రమూర్తి, ఎం.నాగేశ్వర్ రావు, డి.వి.ఎస్.సూర్యనారాయణ రాజులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News