Monday, April 29, 2024

ఎపితోనే కాదు, దేవుడితోనైనా కొట్లాడుతాం

- Advertisement -
- Advertisement -

ఎపితోనే కాదు, దేవుడితోనైనా కొట్లాడుతాం

ఉమ్మడి జిల్లా కృష్ణనీటి వాటాను ఒక్క బొట్టూ వదులుకోం

నారాయణపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ మంత్రి కెటిఆర్
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల బాలల ఐసియు వార్డు ప్రారంభం
సమీకృత మార్కుట్, అమరవీరుల స్థూపం, రోడ్ల సుందరీకరణ పనులకు శంకుస్థాపన
చేనేత కార్మికుల ఉపాధికి ఏర్పాటు కానున్న నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి కేంద్రం, చిన్నపిల్లల, సైన్స్ పార్కుల ప్రారంభం

మన తెలంగాణ/నారాయణపేట: ఉమ్మడి జిల్లాకు న్యాయబద్ధంగా రావాల్సిన కృష్ణ నీటి వాటా కోసం సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఎపితోనేకాదు.. అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడటానికి సిద్ధమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, స్థానిక ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్ రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధ్ది కా ర్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో పది పడకల చిన్నపిల్లల ఐసియు వార్డును ప్రారంభించారు. ఆరుకోట్ల రూపాయల వ్యయంతో సమీకృ త మార్కెట్, ఇరవై లక్షలతో అమరవీరుల స్థూపం, కోటి 59 లక్షలతో రోడ్ల సుందరీకరణ పనులకు శం కుస్థాపన చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిం చి అన్ని విధాల ఆదుకోవడానికి సింగారం చౌరస్తా వద్ద దాదాపు రెండున్నర ఎకరాల్లో చేనేత నైపుణ్య శి క్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని పది కోట్ల రూపాయల వ్య యంతో ఏర్పాటుచేయనున్నారు. 80 లక్షల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల పార్క్, 1.45 కోట్ల వ్య యంతో నిర్మించిన సైన్స్ పార్క్ ను ప్రారంభించారు.

మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో అమలుచేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవతున్నాయన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి సిఎం కెసిఆర్ త్వరలో అయిదు లక్షల రూపాయలతో చేనేత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. పేట జిల్లాకు శాశ్వత సాగునీటికి కర్వెనా రిజర్వాయర్ పూర్తిచేసి, కాలువ ద్వారా కృష్ణ జలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల పదో తేదీన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని, అందరూ అనుకూలంగా అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. అంతేగాకుండా జిల్లాకు నూతన కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయాల కోసం భవనాలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా…రైతుబంధు పథకంలో భాగంగా సిఎం కెసిఆర్ కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలకు నిధులు క్రమం తప్పకుండా విడుదల అవుతున్నాయని చెప్పారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఒకప్పుడు రైతులు వర్షాలు లేక తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నుంచి నేడు మన రైతులు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నారని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పూర్తిచేసి, నారాయణపేటకు సాగునీటిని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, మండలి విప్ దామోదర్ రెడ్డి, మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి, జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ, మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలె వెంకటేశ్వర్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహం, కలెక్టర్ హరిచందన, మున్సిపల్ చైర్మన్ అనసూయ గందె, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజారామయ్యర్, సీడీఎంఏ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, తదితరులు పాల్గొన్నారు.
నా కూతురు నన్ను బెదిరించింది: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన కూతురితో జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు. ’నాన్న నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఈ రోజు అని 12ఏళ్ల నా బిడ్డ అడిగింది. నారాయణపేట వెళుతున్నాను అని చెప్పాను. ఎందుకు అని అడిగితే కార్యక్రమాల వివరాలు చెప్పాను. అక్కడ సమావేశంలో అందరికన్నా ముందు మాట్లాడాల్సి వస్తే నీ కన్నా బాగా మాట్లాడే శ్రీనివాస్ గౌడ్ అంకుల్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అంకుల్ వాళ్ళ పేర్లు చెప్పి మీరు తక్కువ మాట్లాడి మిగతా విషయాలు వారు మాట్లాడతారని చెప్పండి. మధ్యలో మాట్లాడాల్సి వస్తే మంత్రి శీనన్న, ఎమ్మెల్యే బాగా మాట్లాడారు. నేను ఇంకా చాలా తక్కువ మాట్లాడతాను అని సభికులతో చెప్పండి’ అని కెటిఆర్ వ్యాఖ్యానించడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిసాయి.

Minister KTR Speech at Narayanpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News