Tuesday, April 30, 2024

అర్హులందరికీ ఆసరా పెన్షన్లు

- Advertisement -
- Advertisement -

minister srinivas goud distribute aasara pension

మహబూబ్‌నగర్‌: అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందుతాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 70 సంవత్సరాలలో ఇవ్వని పెన్షన్లను తమ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నదన్నారు. గడచిన 70 సంవత్సరాలుగా ప్రజలు తాగునీటికి, విద్యుత్ కు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కేవలం 200 రూపాయల పెన్షన్ తో నెట్టుకొచ్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డులో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు కేవలం నెలకు 200 రూపాయల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని,తమ ప్రభుత్వం వచ్చాక 2016 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 7436 మందికి నెల నెల 32 లక్షల రూపాయల పెన్షన్ ఇచ్చే వారని, ఇప్పుడు 13029 మందికి 8 కోట్ల 63 లక్షల రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఎదిర వార్డులో గతంలో 102 మందికి నెలకు 20వేల పెన్షన్లు ఇస్తుండగా, ఇప్పుడు 624 మందికి 12 లక్షల 40 వేలరూపాయల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.

ఎదిర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని, తొమ్మిది కోట్ల రూపాయలతో తాగునీటిని తీసుకొచ్చామని, అన్ని వైపుల నుంచి రోడ్లు వేసామని, పక్కనే ఐటి కారిడార్ నిర్మించామని ,ఐటి కారిడార్ లో భూములు కోల్పోయిన వారికి అత్యధికంగా 12 లక్షల రూపాయల పరిహారం ఇచ్చామని, త్వరలోనే ఐటీ కారిడార్ ను ప్రారంభిస్తున్నామని,ఇటీవలే ఫర్నిచర్ కోసం 8 కోట్ల రూపాయలు మంజూరు చేసామని, ఐటి కారిడార్ లో 5000 మందికి శిక్షణ ఇచ్చి,ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు, అన్ని గ్రామాలలో లైటింగ్ సౌకర్యం, ప్రార్ధన మందిరాలు, పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదల ఆభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎదిరను ఇంకా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని, గ్రామస్తులు ఐకమత్యంగా ఉండాలని, మహబూబ్ నగర్ ను హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు .ఇంకా పెన్షన్ రాకుండా మిగిలిపోయిన వారిని గుర్తించి మళ్లీ పెన్షన్లు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, వార్డు కౌన్సిలర్ యాదమ్మ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,మున్సిపల్ ఇంజనీర్ సుబ్రమణ్యం, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News