Saturday, May 4, 2024

పబ్ యజమానులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud meets pub owners

హైదరాబాద్: నగరంలోని పబ్ ల యాజమానులుతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేటలోని సరిత ప్లాజాలో సోమవారం సమావేశమయ్యారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగంపై వస్తున్న ఆరోపణలపై చర్చించారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యాలదే బాధ్యతన్నారు. పబ్బుల్లో కార్యకలాపాలు యాజమాన్యాలు గమనించాలని మంత్రి స్పష్టం చేశారు. కార్యకలాపాలు చూడలేకపోతే పబ్బులు మూసివేయాలని సూచించారు. శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. డ్రగ్స్ సరఫరాపై 18004252523 నంబర్ కు తెలపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన కొత్త ఉత్తర్వులతో హైదరాబాద్‌లోని పబ్‌లు, క్లబ్‌ల యజమానులు షాక్ లో ఉన్నారు. నగరంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Minister Srinivas Goud meets pub owners

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News