Sunday, April 28, 2024

‘దొంగే.. దొంగన్నట్లుంది’.. మోడీది బురద జల్లుడే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: ప్రధాని మోడీ సికింద్రాబాద్ సభలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని మోడీ మాటలు దొంగే .. దొంగ అన్నట్లు ఉందని రాష్ట్ర ఆర్థ్దిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్‌లో బిఆర్‌ఎస్ ఆత్మీయ స మ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీశ్‌రావును సిద్దిపేట శివాజీ సర్కిల్ నుంచి రాఘవాపూర్ వరకు విద్యార్థ్ధి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంత రం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆ విష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయన్నారు. మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసిన తక్కు వే. మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. నా చివరి శ్వాస వరకు సేవ చేస్తా. మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే’నని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ గడ్డ గులాబీ అడ్డా..రానే రాదు అన్న తెలంగాణను కానే కాదు అన్న కాళేశ్వరంను కట్టి మండుటెండల్లో కెసిఆర్ మత్తల్లు దుంకిస్తున్నారన్నారు. మోడీ నిన్న సభలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని మోడీ మాటలు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. రూ.138 కోట్ల వడ్లు తెలంగాణ వచ్చినప్పుడు పంపితే నేడు రూ.1548 కోట్ల వడ్లు పండుతున్నాయన్నారు. కెసిఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన పంటలు పండుతున్నాయన్నారు.రాష్ట్రం వచ్చాక ఎరువుల కోసం ఇబ్బంది లేదన్నారు. నేడు ప్రతి ఇంట్లో కెసిఆర్ ఉన్నారన్నారు. కాళేశ్వరం దండగా అన్న ప్రతి పక్షాలు గ్రామాల్లోకి వెళ్తే పండుగో, దండగో తెలుస్తుందన్నారు. మోడీ వరంగల్ కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఆపిండన్నారు. కరెంట్ మెటార్లుకు మీటర్లు పెట్టాలని రూ.30 వేల కోట్లు ఆపిండన్నారు. తెలంగాణ అభివృద్ధిని బిజెపి అడ్డుకుంటుందని, ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్‌లో కరెంట్ సరఫరా లేక అయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారన్నారు.

రెండు కోట్లతో పుల్లూరు లక్ష్మినరసింహస్వామి దేవాలయం అభివృద్ధి చేసుకున్నామన్నారు. త్వరలోనే గృహలక్ష్మి కార్యక్రమం ప్రారంభం చేసుకుందామన్నారు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వలేదన్నారు. గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలలో ఉన్న సేవలు సిద్దిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి పెట్టి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్, జడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ, ఎంపిపి శ్రీదేవి చందర్‌రావు, జడ్పిటిసి శ్రీహరి , మండల పార్టీ అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, ఎంపిపి శ్రీదేవి రాంచందర్‌రావు, సుడా చైర్మన్‌మారెడ్డి రవీంరద్‌రెడ్డి, వైస్ ఎంపిపి యాదగిరి, ప్రజాప్రతినిధులు , నాయకులు వంగనాగిరెడ్డి, బాలకిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, బాల్‌రంగం, నరేందర్‌రెడ్డి, ప్రభాకర్ వర్మ, మోహన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News