Saturday, May 11, 2024

యువతిపై గ్యాంగ్ రేప్.. ఏడుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

minor girl gang raped in rajahmundry

అమరావతి: రాజమండ్రిలో 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు దొరికారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. చెప్పుల షాపులో పని ఇప్పిస్తామని బాలికను నమ్మించి గదిలో నిర్భంధించిన యువకులు నాలుగు రోజులపాటు సామూహిత అత్యాచారం చేశారు. బాధితురాలు కోరుకొండ మండలం మధురపూడికి చెందినదిగా గుర్తించారు. అయితే తమ బిడ్డ కనిపించడం లేదని బాధితురాలి తల్లిదండ్రులు ఈనెల 12తేదీన కోరుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజుల క్రితమే ఆమెను పోలీస్ స్టేషన్ వద్దనే యువకులు వదిలి వెళ్లారు. పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోకుండా తిరిగి తమనే మందలించారని కుటుంబసభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని వాదిస్తున్నారు. నిందితులుపై ఫోక్సో, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజమండ్రిలో 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News