Monday, May 6, 2024

యూఎస్‌కు మిస్టర్ పోలిశెట్టి

- Advertisement -
- Advertisement -

తన కొత్త సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ కోసం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు యంగ్ హీరో. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ముచ్చటించారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్‌కు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. ఇలాంటి ప్రమోషనల్ టూర్ కోసం ప్రస్తుతం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ పోలిశెట్టి. అమెరికాలోని డల్లాస్‌లో ఈ నెల 6వ తేదీన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి.

Also Read: పాలమూరు రంగారెడ్డి కి పచ్చని సంకేతం..

ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్‌లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ప్రీమియర్ షోను ఆడియెన్స్‌తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో ఈ యంగ్ హీరో పర్యటిస్తారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధవుతోంది. ప్రత్యాంగిర సినిమాస్ యూఎస్‌లో ఈ సినిమాను విడుదల చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News