Wednesday, May 15, 2024

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

MK Stalin takes oath as Tamil Nadu Chief Minister

 

చెన్నై: డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో స్టాలిన్ తో పాటు 33 మంది మంత్రుల చేత గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 సీట్లలో డిఎంకె 159 స్థానాలు గెలుచుకొని సిఎం పీఠం దక్కించుకుంది. కోవిడ్ రెండో వేవ్ లో కరోనా విజృంభిస్తోంది. స్టాలిన్ ముందుగా కరోనా కట్టడి లక్ష్యంగా పని చేయాలి. కరోనా రోగులకు అవసరమైన చికిత్స అందించాలి. గత 24 గంటల్లో 23,310 కేసులు నమోదుకాగా 167 మంది చనిపోయారు. ఈ కార్యక్రమంలో మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News