Monday, May 6, 2024

సుందిల్ల బ్యారేజ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని ప్రాంత ప్రజలు, రైతులకు చాలా నష్టమని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం సుందిల్ల పార్వతి బ్యారేజీని ఆయన సందర్శించి మాట్లాడుతూ బ్యాక్ వాటర్‌తో ఎలాంటి ముంపు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

పార్వతి బ్యారేజ్‌ను సందర్శించి అక్కడే సంబంధిత ఈఈ, డీఈలు, ఏఈలతో మాట్లాడి బ్యారేజ్‌కి సంబందించి గేట్లు ఎత్తే సమయంలో ముందస్తు జాగ్రత్తలు ప్రజలకు తెలుపాలని, ముంపు ప్రాంతాల వారికి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. బ్యాక్ వాటర్ వల్ల వ్యవసాయ భూములు ముంపుకు గురి కాకుండా, నివసించే ఇళ్లలోకి నీరు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు.

కడెం ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసినందున శ్రీపాద ఎల్లంపల్లి, రాళ్లవాగు నీరు సుందిల్ల బ్యారేజీకి చేరుతున్నదని, వెంటనే గేట్లు ఎత్తాలని అధికారులకు ఆయన తెలిపారు. ముందస్తుగా రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష జరుపుకోవాలన్నారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అన్నిచోట్ల బ్లీచింగ్ చేయాలని సూచించారు.

మండలంలోని బెస్తపల్లి గ్రామాన్ని సందర్శించి గత సంవత్సరంలో బైక్ బ్యాక్ వాటర్ ద్వార ఇండ్లకు నీరు చేరి పునరావాస కేంద్రాలలో ఉండే పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు అలా కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు భయాందోళనలకు గురి కావద్దని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News