Monday, April 29, 2024

బండి సంజయ్ కథ ఏమిటో కరీంనగర్ వాళ్లకు తెలుసు

- Advertisement -
- Advertisement -

లీగల్ నోటీసుపై బండి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడాలి ?
బండి సంజయ్ కరీంనగర్ గుడి మెట్ల దగ్గర బిచ్చమెత్తుకున్నారు !
హైదరాబాద్: బండి సంజయ్ కథ ఏమిటో కరీంనగర్ వాళ్లకు తెలుసనీ, లీగల్ నోటీసుపై లీగల్ గా స్పందిస్తే ఒకే కానీ, పిచ్చి పిచ్చి మాటలు బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్ టి.భానుప్రసాద్ ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో విప్ ఎం.ఎస్.ప్రభాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ మంత్రి కెటిఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించిన తీరును ఖండిస్తున్నానన్నారు.

కెటిఆర్ గతంలో అమెరికాలో ఏం చేశారో పెద్ద తెలిసిన వాడిలా బండి మాట్లాడుతున్నాడని, కెటిఆర్ ఏం చేశారో తెలియదు కానీ, బండి సంజయ్ మాత్రం కరీంనగర్ గుడి మెట్ల దగ్గర బిచ్చమెత్తుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కార్మిక లోకాన్ని అవమాన పరిచారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ పిచ్చి మాటలు విని కరీంనగర్ ప్రజలు మోస పోయారన్నారు. కేంద్రం నుంచి ఒక్క పైసా అయినా కరీంనగర్ అభివృద్ధికి సంజయ్ తెచ్చాడా అని భానుప్రసాద్ ప్రశ్నించారు. బండికి అసలు ఒకటి నుంచి పది అంకెలు కూడా వచ్చా రావో తెలియదన్నారు.
నష్ట పోయిన వారికి బిజెపి కోటి రూపాయలు ఇచ్చిందా ?
లక్ష కోట్ల లిక్కర్ స్కాం అంటున్నాడు, 30 లక్షల మంది నిరుద్యోగులు అంటున్నాడు, పరీక్ష రాసే అభ్యర్థులకు తలా లక్ష రూపాయలు ఇవ్వాలంటా, మరీ యూపిఎస్సీ పరీక్షలను బిజెపి నేతలు కొందరు లీక్ చేశారని, నష్ట పోయిన వారికి బిజెపి కోటి రూపాయలు ఇచ్చిందా అని భానుప్రసాద్ ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో లక్ష రూపాయలు ఇచ్చారా, బండి సంజయ్ ఓ ఎంపీగా బాధ్యతగా మాట్లాడాలని ఆయన సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో బిఆర్‌ఎస్ పాత్ర ఎంతో బిజెపి పాత్ర ఎంతో తేల్చుకుందాం రా , బండి నాతో బహిరంగ చర్చకు రా అని భానుప్రసాద్ సవాల్ విసిరారు.

సంజయ్ పరుష పదజాలానికి మించి మాట్లాడగలమని, తమకు సంస్కారం అడ్డు వస్తోందని, తమ అధినా యకత్వం హద్దులు విధించిందని ఆయన తెలిపారు. టిఎస్‌పిఎస్సీ పేపర్ లీక్ పై ప్రతి పక్షాలు నిద్ర లేవకముందే ప్రభుత్వం స్పందించిందన్నారు. నిరుద్యోగులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. అభివృద్ధిని తెలంగాణ కోరుకుంటోందని, పిచ్చి మాటలను కాదన్నారు. అప్పటి విద్యార్థి ఉద్యమాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News