Monday, May 6, 2024

రేపు ఎంఎల్ సి ఎన్నికల నోటిఫికేషన్ జారీ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో : మహబూబ్‌నగర్ – రంగా రెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ విడుదలతోపాటు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల విధులకు సంబంధించి ప్రత్యేకంగా 12 మంది నోడల్ అధికారులను నియమించిన జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ వారికీ వివిధ విభాగాలను కేటాయించారు.

నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లను జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని 3వ అంతస్తులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. సెలవు రోజులు మినహాయించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
నోడల్ అధికారుల వివరాలు ః
క్ర.సంఖ్య నోడల్ ఆఫీసర్ హోదా మొబైల్ నంబర్ విధులు
1. జి. వెంకటేశ్వర్లు ఎస్‌డిసి ( ఎల్‌ఎ ) 9505454019 బ్యాలెట్ పేపర్ తయారీ మరియు ముద్రణ, బ్యాలెట్ బాక్సుల ఏర్పాటు
2. పి. సరోజా ఎసి (అడ్మిన్ ) 9618888110 ఎన్నికల మెటీరియల్ సేకరణ చట్టబద్ధమైనది మరియు చట్టబద్ధం కానిది
3. సంధ్య జెసి (శానిటేషన్) 9025308373 మ్యాన్ పవర్ (పోలింగ్ పర్సనల్, మైక్రో అబ్జర్వర్స్, జోనల్ ఆఫీసర్, కౌంటింగ్ స్టాఫ్ & ఇతర అధికారులు)
4. పద్మజ (సిఎంఓహెచ్) 6309919076 ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలు మరియు కోవిడ్-19 ప్రోటోకాల్‌లు
5. కె. నర్సింగ్ రావు ౄy.ఈఈ(ఐటి) 9963551523 ఐటి సంబంధిత సమస్యలు మరియు లైవ్ వెబ్‌కాస్టింగ్
6. (1) శ్రుతి ఓజా, (ఎసి) ఆరోగ్యం 7337078009 శిక్షణ
(2) సౌజన్య (పిడి యుసిడి) 7995007439 శిక్షణ
7. ఎన్. ప్రకాష్ రెడ్డి డైరెక్టర్ (ఈవిడిఎం) 7207923085 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లా అండ్ ఆర్డర్,రవాణా వాహనాలను సమీకరణ
8. మహ్మద్ జియావుద్దీన్ (ఈఎన్‌సి) 9704567437 డిఆర్‌సి గుర్తింపు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రాథమిక కనీస సౌకర్యాలు
9. ముర్తుజా అలీ (సిపిఆర్‌ఓ) 7036644111 మీడియా , ఫేడ్ వార్తలు/మీడియా మానిటరింగ్ సెల్ , ఓటరు అవగాహన కార్యకలాపాలు
10. బాషా ఎస్టేట్ ఆఫీసర్ 9704990960 24×7 ఫిర్యాదు సెల్, పరిష్కరణ కాల్ సెంటర్
11. మహేష్ కులకర్ణి చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్ 9989930636 నివేదికలు, రిటరన్స్
12. విజయ భాస్కర్ రెడ్డి పర్సనల్ ఆఫీసర్, 9849345646 పోస్టల్ బ్యాలెట్
ఎన్నికల షెడ్యూల్ ః
1. నోటిఫికేషన్ జారీ 16 ఫిబ్రవరి (గురువారం)
2. 16 నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రారంభం
3. నామినేషన్లు చివరి తేదీ 23 ఫిబ్రవరి (గురువారం)
4. ఫిబ్రవరి 24 నామినేషన్ల పరిశీలన (శుక్రవారం)
5. అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 27 ఫిబ్రవరి (సోమవారం)
6. ఎన్నికలు 13 మార్చి (సోమవారం)
7. .ఓటింగ్ సమయం 08.00 నుండి సాయంత్రం 04.00 వరకు
8. ఓట్ల లెక్కింపు 16 మార్చి, (గురువారం)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News