Tuesday, May 7, 2024

పేదవాళ్లకు ఇంటికో పింఛన్ ఇస్తున్నం: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha distributed Aasara pensions

 

హైదరాబాద్: ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇచ్చే స్థాయికి తెలంగాణలో సంపద పెరగాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధి దారులకు కొత్త ఆసరా పింఛన్లను పంఫిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పాల్గొన్నారు. రాష్ట్రంలో పింఛన్, రేషన్, షాదీముబారక్, కెసిఆర్ కిట్, ఇవ్వొద్దని ప్రధాని మోడీ చెబుతున్నారని మండిపడ్డారు. మోడీ తన మిత్రులకు మాత్రం బ్యాంకుల నుంచి రూ.10 లక్షల కోట్లు పంచారని ఆమె ఆరోపించారు. పేదవాళ్లకు మాత్రం సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని మోడీ అంటున్నారన్నారు. పేదవాళ్లకు ఇంటికో పింఛన్ ఇస్తున్నామన్న ఆమె ఇంట్లో ఉన్న సభ్యులందరికీ రేషన్ ఇస్తున్నామని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News