Tuesday, April 30, 2024

కరోనా టీకాల పంపిణీలో మొబైల్ టెక్నాలజీ

- Advertisement -
- Advertisement -
Mobile technology for COVID-19 vaccination
ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నివారించడానికి వ్యాక్సిన్ లభించే అవకాశాలు విస్తృతం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ సాంకేతికత ఉపయోగించి భారీ ఎత్తున టీకా కార్యక్రమం దేశంలో చేపట్టనున్నామని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలో కోట్ల రూపాయల ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి ఈ సాంకేతికత దోహదం చేసిందని అన్నారు. ఈ సాంకేతికత వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. వీలైనంత త్వరగా 5 జి సాంకేతికత ప్రజలకు అందుబాటు కాడానికి ప్రతి ఒక్కరూ కలసి పనిచేయాలని, తద్వారా భవిష్యత్ అవకాశాలను పుణికి పుచ్చుకోడానికి భారత యువతకు మార్గం సుగమం చేయాలని ఈ సందర్భంగా టెలికాం రంగాన్ని ప్రధాని కోరారు. టెలికాం రంగంతోపాటు మొబైల్ తయారీ పరిశోధనకు కేంద్రంగా భారత్‌ను మార్చాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News