Wednesday, May 1, 2024

ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది : నేపాల్ వెల్లడి

- Advertisement -
- Advertisement -

Mount Everest new height is 8848.86 meters

ఖాట్మండ్ : ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 1954 లో సర్వే ఆఫ్ ఇండియా ఈ పర్వతం ఎత్తును కొలిచి 8,848 మీటర్లని ఆనాడు నిర్ధారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎత్తునే అందరూ నిర్ధారిస్తున్నారు. అయితే నేపాల్, చైనా తాజాగా ఈ ఎత్తును మళ్లీ కొలిచి 0.86 మీటర్ల వరకు ఎత్తు పెరిగిందని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో ప్రకటించారు. 2015 లో హిమాలయ పర్వత ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు ఈ ఎవరెస్ట్ ఎత్తు మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడడంతో నేపాల్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఈ పర్వతాన్ని కొలవడం ప్రారంభించింది. ఇందులో నేపాల్‌తోపాటు చైనా అధికారులు కూడా పాలుపంచుకున్నారు.

Mount Everest new height is 8848.86 meters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News