Tuesday, May 14, 2024

హైదరాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు హైదరాబాద్ ఎయిర్‌ఫోర్టులో ప్రత్యేక స్టోరేజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ను నిర్ణీత కాలం వరకు నిల్వ చేయాలంటే మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతను సమతుల్యం చేయాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే, తయారీదారుల నుంచి తుది గమ్యస్థానానికి వ్యాక్సిన్లను చేరవేసేందుకు కార్గో సేవలను వినియోగించనున్నారు. ఎయిర్ క్రాఫ్ నుంచి కార్గో టెర్మినల్ మధ్యలో కూడా వ్యాక్సిన్ ఉష్ణోగ్రతల్లో మార్పు రాకుండా ఉండేందుకు అవసరమైనన్నీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక సప్లాయ్ చేసే క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చైన్ సిస్టం విధానంలో రవాణా చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Vaccine storage center at Hyderabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News