Monday, April 29, 2024

హూడా కమిటీ సిఫార్సులే ప్రస్తుత చట్టాల్లో ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

Recommendations of HUDA Committee are contained in existing laws

 

ప్రభుత్వ వర్గాల వాదన

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల్లో చేర్చిన చర్యలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోకి కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణలేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునివ్వడం, కాంగ్రెస్, ఎన్‌సిపి సహా పలు రాజకీయ పార్టీలు బంద్‌కు తమ మద్దతు తెలియజేసిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచిన నేపథ్యంలో కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ సోమవారం ప్రతిపక్షాలు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సిగ్గుచేటని, కొత్త చట్టాల్లో కీలకమైనవిగా చెప్తున్న సంస్కరణలను గతంలో కాంగ్రెస్, ఎన్‌సిపిలు సమర్థించాయని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రవాణా, కొనుగోళ్లు, అమ్మకాలు, నిల్వ, ఫైనాన్సింగ్ లాంటి ఆంక్షలనుంచి మార్కెట్‌కు తక్షణం స్వేచ్ఛ కల్పించాలని, వ్యవపాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఎపిఎంసి) లేదా కార్పొరేట్ లైసెనులు లాంటివి మార్కెట్‌ను నియంత్రించకుండా చూడాలని 2010 డిసెంబర్‌లో సమర్పించిన నివేదికలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోని కమిటీ పేర్కొనిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే వ్యవసాయ మార్కెట్ల కాన్సెప్ట్‌ను ప్రోత్సహించాలని కూడా కమిటీ తన నివేదికలో తెలిపింది. అంతేకాదు, అత్యవసర సరకుల చట్టం వినియోగాన్ని కేవలం అత్యవసర సమయాల్ల్లో మాత్రమే చేయాలని, అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి దానిపై నిర్ణయం తీసుకోవాలని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. 2003లో కమిటీ నమైనా మార్కెటింగ్ చట్టాన్ని రాష్ట్రాల అమలుకోసం పంపిణీ చేసింది.‘ ఈ నమూనా చట్టం రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ మార్గాలను అందిస్తోందని.. రాష్ట్రాలు ఈ సంస్కరణలను ఆమోదించి, అమలు చేయాల్సిన అవసరం ఉందని, వాస్తవానికి రైతులకు స్వేచ్ఛాయుత, పోటీతో కూడిన మార్కెట్‌ను అందించడానికి నమూనా చట్టాల్లో సూచించిన ప్రతిపాదనలకు మించి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆ నమూనా చట్టం గురించి కమిటీ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వం భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలో 2003లో ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో హూడా నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసిన సంస్కరణలే ఇప్పుడు ఆ పార్టీ వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాల్లో ఉన్నాయని కూడా ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News