Monday, April 29, 2024

‘హెలికాప్టర్ మనీ’పై మోడీ ఏం చెప్తారో..

- Advertisement -
- Advertisement -

Modi

 

ఆర్థిక వెసులుబాటుపైనే ఆశలు
అప్పు కిస్తీల చెల్లింపు గడువు, ఎఫ్‌ఆర్‌బిఎం పెంపుపై రాష్ట్రం విజ్ఞప్తులు
ప్రధాని మోడీ ప్రసంగంలో ఆర్థిక నిర్ణయాలపై రాష్ట్రాల ఆసక్తి

మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకుంది. ఇటు రాష్ట్రంతో పాటు కేంద్రానికి రావాల్సిన పన్నులు కూడా రావ డం లేదు. దీంతో ఆర్థిక వెసులుబాటు ఉం టుందని భావిస్తోంది. తెలంగాణకు నెలకు సగటున రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో వస్తు సేవల పన్ను ద్వారా వచ్చే మొత్తం రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఉంటుంది.

ఇక ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్స్, పెట్రోల్, డిజిల్ వంటి ఆదాయం అదనం. ప్రభుత్వ అంచనాల ప్రకారం లిక్కర్ ద్వారా నెలకు రూ.1300 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రకటిత లాక్‌డౌన్ ప్రకారం 40 రోజుల్లో ఏకంగా రూ.1500 కోట్ల వరకు కోల్పోతుంది. ఈ రకంగా అన్ని దిక్కుల నుంచి రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఏప్రిల్ నెల సగం రోజులు అవుతున్నా, ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకే రాష్ట్ర ఆదాయం ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించనుండటంతో ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన నిర్ణయాలు, ప్రకటనలపై రాష్ట్రాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ నామమాత్రపు చర్యలతో సరిపెడితే ఎలా ముందుకు వెళ్లలానే దానిపై సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఒవర్ డ్రాప్ట్ ద్వారా రిజర్వ్ బ్యాంకు నిధులు తీసుకోవడం వంటి వాటిపై అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. ఒ.డి కాలపరిమితి రెండు నెలలే ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆర్థిక అధికారులు చెబుతున్నారు.

కోల్పోయిన ఆదాయాన్ని పూడ్చినా మేలే
రాష్ట్రాలకు నిధులు వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని సిఎం కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వివరించిన విషయం తెలిసిందే. 201920 ఆర్థిక సంవత్సరానికి దేశ జిడిపి 230 లక్షల కోట్లుగా నిర్ధారించారు. ఇందులో 5 శాతం అంటే దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు హెలికాప్టర్ మనీ ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను చాలా వరకు ఆదుకున్నట్లు అవుతుందని కెసిఆర్ ఆలోచన. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల ఆదాయం, పన్నుల వాటా, స్థానిక అవసరాలకు అనుగుణంగా హెలికాప్టర్ మనీని పంపిణీ చేస్తే తెలంగాణకు కనీసం రూ.30 వేల కోట్ల వరకు వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఆ స్థాయిలో కేంద్రం హెలికాప్టర్ మనీ ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కొనసాగిన రోజుల్లో కోల్పోయిన ఆదాయంలో కనీసం 50 శాతం నుంచి 70 శాతం పూడ్చే విధంగా నిధులిచ్చినా సరిపోతుందని పేర్కొంటున్నారు. అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బిఎంను 3 శాతం నుంచి 5 శాతం పొడగిస్తే అప్పులు తీసుకునేందుకు మరింత వెసులుబాటు దొరుకుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఒవర్ డ్రాప్ట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చినందున ఎఫ్‌ఆర్‌బిఎం విషయంలో సానుకూల నిర్ణయాలు అంతగా ఉండకపోవచ్చునని, ఆర్‌బిఐ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు తెలిపారు.

అప్పుల కిస్తీ వాయిదాపై ఏం చేస్తారో !
రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం ఆరు నెలల పాటు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తెలంగాణ అప్పు రూ.2 లక్షల కోట్లు వరకు ఉంది. వీటిలో కొన్నింటికి చెల్లింపులు అప్పుడు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ అధికారుల లెక్కల ప్రకారం నెలకు ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకే రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు పోతుంది.

 

Modi decision on Helicopter Money
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News