Wednesday, May 1, 2024

మర్కజ్ పాయె.. దేవ్‌బంద్ వచ్చె!

- Advertisement -
- Advertisement -

devaband

 

నిజాముద్దీన్ తరహాలో యుపిలోని ప్రార్థనా స్థలికి రాష్ట్రం నుంచి 100 మంది?
వెళ్లి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురికి కరోనా
మిగతా వారి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్‌లోని దియోబంద్‌లో ఓ మసీదులో నిజాముద్దీన్ తరహాలోనే మత సమావేశాలు జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యులు, పోలీసులు బాధితుల ట్రావెల్ హిస్టరీ గురించి ఆరా తీయగా వీరు యూపిలోని దియోబంద్‌లో మసీదులో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు విచారణలో తేలింది. వీరితో పాటు ఇదే ఉమ్మడి జిల్లాలకు చెందిన 20 మంది వరకూ ఇదే మసీదుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మసీదుకు వెళ్లొచ్చిన వారి సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ మర్కజ్ మసీదులో ప్రార్థనలు నిర్వహించిన తబ్లిగీ జమాత్ కార్యకర్తలే ఆ సమావేశాల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిజాముద్దీన్ తరహాలోనే యూపీలో ప్రార్థనలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ నుంచి పెద్ద సంఖ్యలో రాజస్థాన్‌లోని ఆజ్మీర్ దర్గాను సందర్శించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దేవ్ బంద్ లో మార్చి 19 నుంచి 24 వరకు జాతీయ మదర్సా సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. అక్కడకు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరించడంతో పాటు, వారిని గాలించే పనిలో పడింది. కాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి దాదాపు 100 మంది వరకు హాజరైనట్టు పోలీసులు భావిస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు కేసులు నమోదు కాగా మరికొందరు ఆచూకీ కోసం పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు యూపి డియోబంద్ మజీద్ కు హాజరైన వారిపై లెక్కలు తీస్తున్న తీసేపనిలో నిమగ్నమయ్యారు. మర్కజ్ ప్రార్థనలకు సంబంధించిన ఉదంతం కూడా తొలుత తెలంగాణలోనే బయటపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కేంద్రం ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో నిజాముద్దీన్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగాయి. ఈ ఘటనను మరువక ముందే రాష్ట్రాన్ని దియోబంద్ ఘటన కలకలం రేపుతోంది. తాజాగా నిజాముద్దీన్ తరహాలోనే మరో ఉదంతం వెలుగు చూడటంతో అటు పోలీసులు, ఇటు వైద్యాదికాకారులు మరింత అప్రమత్తమయ్యారు.

 

Religious gatherings along lines of Nizamuddin
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News